మృతి చెందిన రైతు కుటుంబానికి చెక్కు అందజేత
భద్రాచలం పట్టణం: మండలంలోని గన్నవరం గ్రామానికి చెందిన రమణయ్య కుటుంబానికి బీమా చెక్కును ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా భద్రాచలం సహకార సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సహకార సంఘం కార్య నిర్వహణాధికారి రాంబాబు మాట్లాడుతూ తమ సంఘంలో సభ్యునిగా ఉన్న రమణయ్యకు బీమా సౌకర్యం కల్పించామన్నారు. రూ. 50వేల బీమా చెక్కును మృతుని భార్య వెంకటరమణకు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షులు నగేష్. సిబ్బంది రాధాకృష్ణ , నాగరాజు పాల్గొన్నారు.