*మృతుడు నిఖిల్ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలి*

– లంబాడి విద్యార్థి సేన డిమాండ్

సూర్యాపేట జిల్లా కేంద్రం రాజునాయక్ తండాలో వారం రోజుల క్రితం ప్రేమ పేరిట హత్యగావింపబడిన దారావత్ నిఖిల్ నాయక్ వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మునగాల మండల కేంద్రంలో సోమవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ, లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు మూడవత్ రవిచంద్ మాట్లాడుతూ, బాధితుల కుటుంబానికి అధికారులు సత్వర న్యాయం చేకూర్చాలని, హత్య చేసిన వారిపై క్రిమినల్ మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, అదేవిదంగా ప్రభుత్వం వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి వారిని ఆదుకోవాలని, అంతేకాకుండా 20తారీకున సూర్యాపేట కలెక్టర్, ఎస్పీని కలిసి న్యాయం చేయాలని లంబాడి విద్యార్థి సేన తరుపున వినతి పత్రం అందజేయబోతున్నామని, అధికారులు న్యాయం చేయని యెడల తెలంగాణ రాష్ట్రంలోని మిగతా ప్రజాసంఘాలు, గిరిజన సంఘాలు, లంబాడా సంఘాలు, విద్యార్థి సంఘాలతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు దిగుతామని లంబాడి విద్యార్థి సేన నాయకులు హెచ్చరించారు.