మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం-కల్లూరి
తుర్కపల్లి మండలం, వాసాలమర్రి గ్రామానికి చెందిన జనార్ధన్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. అతనికి భార్య,ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నారు. ఆ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోవడంతో వారు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.
ఇతనిది నిరుపేద కుటుంబం కావున ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని గ్రామస్తులు పైవిషయాన్ని తెలంగాణ పరిరక్షణ సమితి కన్వీనర్ కల్లూరి రాంచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వారు తెలియజేసిన వెంటనే సానుకూలంగా స్పందించి ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది.ఈకార్యక్రమంలో. మాజీ బాలరాజ్ , కొక్కొండ సత్తయ్య, పలుగుల శ్రీనివాస్, పలుగుల వెంకటేశ్వరరావు, కొండ చంద్ర, టీపీఎస్ సభ్యులు, మాడిగే వెంకటస్వామి,గడ్డమీది యాదగిరి,బాలు తదితరులు పాల్గొన్నారు.