మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన జడ్పిటిసి మధుకర్.

మర్పల్లి, అక్టోబర్ 14 (జనం సాక్షి) మర్పల్లి మండల కేంద్రానికి చెందిన చాకలి ఎల్లయ్య కుమారుడు నాగేష్ ఇటివల మృతి చెందినాడు. ఇట్టి విషయాని తెలుసుకొన్న జెడ్పీటీసీ మధుకర్ మృతుని కుటుంబనికి శుక్రవారము పరామర్శించి వారి కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్ధిక సహాయం చేశారు. వారి వెంట వైస్ ఎంపిపి మోహన్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ గౌస్, వార్డు సభ్యులు శ్రీనివాస్, బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ గఫార్, సీనియర్ నాయకులు ఖాజా, శేఖర్, మాల్లిక్, మిత్ర, వసంత కుమార్ తదితరులు ఉన్నారు.