మృతురాలి కుటుంబానికి  ఆర్ధిక సహాయం – కల్లూరి

తుర్కపల్లి  మే 26 (జనంసాక్షి)
తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాని కి చెందిన పబ్బోజు సరోజన ( 70 ) ఆనారోగ్యంతో బాధపడుతు శుక్రవారం మృతి చెందింది. మృతురాలి కి వారసులు ఎవరు లేరన్న విషయాన్ని గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలంగాణ పరిరక్షణ సమితి కన్వీనర్ కల్లూరి రాంచంద్రారెడ్డికి తెలపడంతో అంత్యక్రియల నిమిత్తం రూపాయలు 5000 వేలు తెలంగాణ పరిరక్షణ సమితి సభ్యుల ద్వార కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోడేటి జహింగీర్ ,  పలుగుల ప్రేమ్ చందర్ , మెరుగు సతీశ్ , వెంకటేష్ , రామ్ నర్సయ్య  , నర్సిహాలు , జంగయ్య , రాములు ,  మరియు టీ పి ఎస్ సభ్యులు గడ్డమీది యాదగిరి , దొమ్మేటి బాబు , మడిగే వెంకటస్వామి తదితరులు ఉన్నారు.