మృత్యుంజయం… మృతుల స్మృతులను గౌరవించు : ఎంఐఎం

గంభీరావుపేట, జూలై 30 (జనంసాక్షి) : మృత్యుంజయం మృతు ల స్మృతులను గౌరవించాలని ఎంఐఎం సూచించింది. అక్కడ సమాధులు ఉన్నాయని, అది ముమ్మాటికీ ముస్లింలవేనని, అందరి మనోభావాలను గౌరవించాలని అన్నారు. వక్ఫ్‌బోర్డు సర్వేయర్‌, ల్యాండ్‌ అండ్‌ సర్వే రికార్డ్సు సంయుక్తంగా సర్వే చేయించేం తవరకు ఆ స్థలాన్ని అలాగే ఉంచాలని, సమాధులు కూల్చాలని చూస్తే ఊరుకొనేది లేదని స్పష్టం చేశారు. అప్పటిదాకా ఆ స్థలంలో ఎలాంటి పనులు చేపట్టరాదని వారు పేర్కొన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేసేందుకైనా వెనకాడమని తేల్చిచెప్పారు.

ఎంఐఎం మద్దతుతోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో కొనసాగు తుందనీ, దీనిపై తమ పార్టీ అసెంబ్లీలో సైతం గళం విప్పుతామని మృత్యుంజయం అక్రమాలపై పోరాడు తామన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకే తాము ఇక్కడ పర్యటిం చామన్నారు. అధికార పార్టీ నాయకుడిగా పార్టీలో ఉన్నత మైన హోదాలో మృత్యుంజయం లాంటి వ్యక్తికి ఇలాంటి పనులు తగవని, తమ మనోభావాలను గౌరవిస్తూ ఇప్పటికైనా తన దుర్మార్గాన్ని ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నేతలు జిల్లా అధ్యక్షుడు వహాజుద్దీన్‌, నగర అధ్యక్షుడు అబ్బాస్‌ సమీ, సెక్రెటరీ గులాం అహ్మద్‌ హుస్సేన్‌, నగర నాయకులు మహ్మద్‌ షఫీ, బాబూజానీ, తదితరులు పాల్గొన్నారు.