మెక్సికో తీరంలో భారీ భూకంపం

 

రిక్టర్‌ స్కేలుపై 8గా నమోదు :సునావిూ హెచ్చరికలు జారీ

భూకంప ధాటికి పరుగులు తీసిన జనం..కుప్పకూలిన భవనాలు

మెక్సికో,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): అమెరికా మెక్సికో తీరంలో శుక్రవారం ఉదయం భారీ భూకంపం చోటుచేసుకుంది. 8.0 తీవ్రతతో మెక్సికో నైరుతి తీరాన్ని మొత్తం వణికించింది. దీంతో సునావిూ హెచ్చరికలు జారీచేశారు. భూకంపం ప్రభావంతో భారీ అలలతో కూడిన సునావిూ సంభవించే ప్రమాదం ఉందని అధికారులు 8 రాష్టాల్ర ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. పిజిజియాపన్‌ పట్టణానికి నైరుతి దిశగా 123 కిలోవిూటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. 33 కిలోవిూటర్ల అడుగున భూకంపం సంభవించినట్టు వెల్లడించింది. దీనికారణంగా భారీ సునావిూ సంభవించే అవకాశాలున్నట్టు పసిఫిక్‌ సునావిూ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. భూకంపంతో తీవ్ర భయాందోళనుకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. మెక్సికో: దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. మెక్సికో తీరంలోని ట్రెస్‌పికోకు 119 కిలోవిూటర్ల దూరంలో ఈ భూకంపం సంభించింది. పిజిజియాపన్‌కు 123 కిలోవిూటర్ల దూరంలో సముద్రగర్భంలో 33 కిలోవిూటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యంత శక్తిమంతమైన ప్రకంపనలు రావడంతో మెక్సికో సిటీలోని భవనాలు బీటలు వారాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు. దాదాపు 90 సెకండ్ల పాటు భవనాలు కంపించాయని స్థానికులు చెబుతున్నారు. భూకంపం కారణంగా ఎనిమిది దేశాలకు

సునావిూ హెచ్చరికలను జారీచేసినట్లు యూఎస్‌ వాతావరణ అధికారులు వెల్లడించారు. మెక్సికో, గ్వాటెమాలా, ఎల్‌ సాల్వడార్‌, కోస్టారికా, నిఖరాగ్వా, పనామా, ¬ండూరస్‌, ఈక్వెడార్‌ దేశాలకు సునావిూ హెచ్చరికలు జారీ చేశారు. భూకంప ధాటికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. 1985 తర్వాత మెక్సికోలో ఇదే అత్యంత శక్తిమంతమైన భూకంపం అని అధికారులు చెబుతున్నారు. మరోవైపు న్యూజిలాండ్‌ అధికారులు సైతం తీరం వెంబడి సునావిూ వచ్చే అవకాశాలున్నాయా లేదా అనే దానిపై సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే 12 గంటల ప్రయాణమంత దూరంలో ఉన్నందున న్యూజిలాండ్‌కు సునావిూ వచ్చే అవకాశం లేదని న్యూజిలాండ్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ ఎమ్జ్గం/న్సీ మంత్రిత్వశాఖ వెల్లడించింది. వేలాది మందిని బలితీసుకున్న 1985 భూకంపం తర్వాత… మళ్లీ అంతటి స్థాయిలో భూకంపం రావడం ఇదే మొదటిసారి అని మెక్సికో అధికారులు చెబుతున్నారు. దాదాపు 90 సెకండ్లపాటు ప్రకంపనాలు తీవ్ర ఆందోళనకు గురిచేసినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. దాదాపు నిమిషమన్నర పాటు భవనాలు కంపించాయని స్థానికులు తెలిపారు.