మెటల్‌ వర్క్స్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం

అమీర్‌పేట్‌, హైదరాబాద్‌ : సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడలోని విజేత మెటల్‌ వర్క్స్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫర్నీచర్‌ షెడ్డులో మంటలు చెలరేగాయి. ప్రమాదం ధాటికి షెడ్డు కుప్పకూలింది. సనత్‌నగర్‌ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో కంపెనీలో కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వారం రోజుల క్రితం ఇదే పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.