మెడికల్‌ టూరిజం హబ్‌గా హైదరాబాద్‌

ఐటిరంగంలో దూసుకునిపోతున్న హైదరాబాద్‌ పారిశ్రామిక ప్రగతితో పాటు వైద్య రంగంలోనూ ముందడుగు వేస్తోంది. నాలుగేళ్లుగా ఈ రంగంలో గణనీయమైన ప్రగతి వస్తోంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో తెలంగాణ ముందున్నది. ఇక్కడి వాతావరణ, అవకవౄలు, సౌకర్యాలు అన్ని రంగాలను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందుకు ఇటీవల తీసుకుంటున్న చర్యల కారణంగా సత్ఫలితాలు వస్తున్నాయి. పర్యాటకంగా ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. దీంతో వైద్యరంగం కూడా పురోగమిస్తోంది. ప్రైవేట్‌ రంగంలో అధునాతన ఆస్పత్రులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా అధునాతన ఆస్పత్రుల సంఖ్య నాలుగేళ్లలో పెరిగింది. అభివృదద్‌ఇ చెందిన దేశాలకు తీసిపోని విధంగా అధునాతన వైద్యం అందుతోంది. అనుభవజ్ఞులైన వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందితో సేవలు 24 గంటలు అందుబాటులో ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా సౌకర్యాలు కూడా మెరుగు పడ్డాయి. ఇతర దేశాలకు తీసిపోని విధంగా జంటనగరాల్లో వైద్యరంగం గణనీయమైప పురోగతిలో ఉంది. ఇకపోతే ఇటీవల ఇక్కడి ఆస్పత్రుల్లో అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు చికిత్సకు హైదరాబాద్‌ వైపు చూస్తున్నారు. మెడికల్‌ టూరిజం అభివృద్దికి తీసుకుంటున్న చర్యల కారణంగా ఇతర దేశాలవాళ్లు ఇక్కడికి వచ్చి తక్కువ ఖర్చుతోని వైద్యం చేయించుకోవడం పరిపాటిగా మారింది. ఆయాదేశాల్లో ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చు కంటే మన దగ్గర చాలా తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందివ్వడం కారణంగా మెడికల్‌ టూరిజంకు ప్రాధాన్యం పెరిగింది. అందుకే ఈ మధ్య కాలంలోపెద్ద సంఖ్యలో మెడికల్‌ టూరిస్టులు ఇతర దేశాల నుండి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఢిల్లీ, ముంబై, చైన్నై, బెంగుళూరులతో పోటీపడి హైదరాబాద్‌ కూడా వైద్య సేవలను అందిస్తోంది. ఈ నగరాలతో పోలిస్తే ఇక్కడి వైద్య సేవల ఖర్చులు కూడా తక్కువగా ఉంటున్నాయి. దీంతో విదేవీయులకు హైదరాబాద్‌ వైద్యంపై నమ్మకం ఏర్పడింది. అందుకే ఆస్పత్రుల్లో ఎన్‌ఆర్‌ఐ వార్డులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 1980 దశకం తర్వాత హైదరాబాద్‌లో మెడికల్‌ టూరిజం కొత్తగా పెరగడం మొదలైంది. ఈసారి కార్పొరేట్‌ హాస్పిటళ్లు ఇస్తున్న సదుపాయాలతో ఇతర దేశాల నుండి పేషెంట్లు వచ్చేవాళ్లు. మొదట్లో ఎక్కువగా కాస్మోటిక్‌ సర్జరీల కోసం ఇతర దేశాల నుండి వచ్చేవాళ్లు. ఇందులో ప్రధానంగా ముక్కు, బ్రెస్ట్‌, దంత వైద్యం లాంటివి ఉన్నాయి. సర్జరీలు అయిపోయిన తర్వాత హైదరాబాద్‌ లోని చారిత్రక ప్రదేశాలు చూసి తిరిగి వారి దేశానికి వెళ్లేవాళ్లు. 2010 తర్వాత మన దగ్గర మెడికల్‌ టూరిజం మరింత ఊపందుకుంది. ఇలా వచ్చేవాళ్ల సంఖ్య వేల్లో ఉంది. ఎక్కువగా ఆఫ్రికన్‌ దేశాలు, మధ్య ఆసియా దేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. చాలాదేశాల్లో అందుబాటు లో లేని వైద్యాన్ని ఇవ్వడంతో పాటు టూరిజాన్ని కూడా ఆకట్టుకునేలా చేస్తున్నారు. రోగి కోలుకున్న తరవాత ముఖ్యమైన ప్రదేశాలను చూపించేలా ప్యాకేజీలు రూపొందిస్తున్నారు. ఎక్కవగా పేదదేశాల నుండే మన దగ్గరకు వస్తున్నారు. వాళ్ల దేశాల్లో వైద్యం ఖర్చును భరించలేనంత ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్‌ వస్తున్నారు. వాళ్ల దగ్గర తక్కువగా ఉన్న సౌకర్యాలతో చికిత్స కోసం ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సి ఉంటుంది. మన దగ్గర ప్రత్యేక సదుపాయాల కారణంగా వెంటనే చికిత్స మొదలుపెట్టే వీలుంది. అందుకే ఇతర దేశాల పేషెంట్లు మన దగ్గరకు ఎక్కువగా వస్తున్నారు. చికిత్స అయిపోయిన తర్వాత చూడదగ్గ ప్రదేశాలకు పోవాలనుకే వారికి రవాణా సదుపాయాలు కూడా మనకు బాగా ఉన్నాయి. చికిత్స, వసతులు, రవాణా, టూరిజం అన్నింటికీ కలిపి ఖర్చులతో ఒకే ప్యాకేజీ కింద మాట్లాడుకుని వస్తున్నారు. ఇలాంటి ప్యాకేజీలను హైదరాబాద్‌లో కార్పొరేట్‌ ఆస్పత్రులు కల్పిస్తున్నాయి. అనుకూలమైన వాతావరణం,

ఆహారం, వసతులు, భద్రత ఇవన్నీ బాగా ఉంటున్నాయి కాబట్టి మెడికల్‌ టూరిజం కింద ఇతర దేశాల నుండి వచ్చేవాళ్ల సంఖ్య బాగా పెరుగుతోంది. రోగులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో రావడానికి రవాణా సదుపాయాలు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. హైదరాబాద్‌ నుండి విమాన సౌకర్యాలు పెరిగిన తర్వాత రోగులు ఇతర దేశాల నుండి రావడం బాగా పెరిగింది. ఐరోపా దేశాలకు మినహా చాలా వరకు ఆఫ్రికన్‌ దేశాలకు, మధ్య ఆసియా దేశాలకు హైదరాబాద్‌ నంచి విమాన సౌకర్యం ఉంది. మరోవైపు వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమాన సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఆస్పత్రులకు రాగానే త్వరగా వైద్యం అందించడం, అధునాతన చికిత్సలు, సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం కూడా కలసి వస్తోంది. భారతదేశంలోని ఇతర పట్టణాలతో పోలిస్తే ఖర్చులు కూడా తక్కువగానే ఉంటున్నాయి. దీనికితోడు ఇక్కడికి వచ్చే వారికి ¬టళ్లు కూడా అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. బడ్జెట్‌లో చికిత్స చేయించుకునేలా అవకాశాలు ఉన్నాయి. చారిత్రక నగరం కావడంతో పనిలోపనిగా ఆయా ప్రాంతాలను చుట్టి వచ్చేలా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా విదేశాల నుంచి చికిత్స కోసం వచ్చే వారికి కలసి వస్తోంది. వాతావరణం, భిన్నమైన సంస్కృతి కూడా రోగులు ఇక్కడికి రావడానికి కారణం అని డాక్టర్లు అంటున్నారు. దీంతో పర్యాటాక అభిశృద్ది కూడా పెరుగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా మెడికల్‌ టూరిజం హైదరాబాద్‌కుమరో అసెట్‌గా భావించాలి.