మెదక్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది
హైదరాబాద్,జనవరి20(జనంసాక్షి):నారాయణ్ ఖేడ్ ఉపఎన్నిక దృష్ట్యా మెదక్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు ఈ నెల 27లోగా ఓటుహక్కు కల్పిస్తమన్నారు. ప్రతీ ఓటరుకు ఫొటోతో ఉన్న ఓటరు పత్రాలు ఎన్నికల సంఘమే అందజేస్తుందని తెలిపారు. 6కంపెనీ కేంద్రబలగాలతో ఎన్నికల బందోబస్తును ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు,కెమెరాలకు అనుమతి లేదన్నారు. ఎన్నికల కోసం 5ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, 5చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎన్నికల దృష్ట్యా మద్యం సరఫరాపై ఆంక్షలు విధిస్తున్నట్టు పేర్కొన్నారు. సాధారణ ప్రజలు డబ్బు తీసుకెళ్లేటపుడు సరైన ఆధారాలు చూపించాలని సూచించారు. ఎన్నికల్లో ఈవీఎంలపై అభ్యర్థుల పొటోలు కూడా ఉంటాయని ఆయన తెలిపారు.