మెమన్‌కు 30న ఉరి
ముంబై పేలుళ్ల కేసు నిందితుడు యాకుబ్ మెమన్‌ను ఉరితీయనున్నారు. జులై 30న మెమెన్‌ను ఉరి తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడ్డ మెమెన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇప్పటికే తిరస్కరించింది. మెమెన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా తోసిపుచ్చారు. దీంతో మెమెన్ ఉరి ఖాయమైంది. ప్రస్తుతం మెమెన్ నాగపూర్ సెంట్రల్ జైలులో ఉంటున్నారు. ముంబయి బాంబు పేలుళ్ల కేసులో మెమెన్‌కు 2007లో టాడా కోర్టు మరణశిక్ష విధించింది. 1993 మార్చి 12న జరిగిన పేలుళ్లలో 250 మందికి పైగా మృతి చెందగా, 750 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో గత 14 సంవత్సరాలుగా జైల్లోనే ఉంటున్నాడు.