మెహిదీపట్నం రైతుబజార్‌లో బాంబు కలకలం

హైదరాబాద్‌, జనంసాక్షి: మెహిదీపట్నం రైతు బజార్లో గుర్తు తెలియని బాక్స్‌ కనిపించడంతో బాంబు ఉందని కలకలం రేగింది. దీంతో ప్రజలు ఉరుకులు పరుగులు పెట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాంబ్‌స్వాడ్‌తో తనిఖీలు నిర్వహించి బాంబు లేదని నిర్ధారించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.