మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలి

దిల్లీ: రెండేళ్లకోసారి జరిగే అతిపెద్ద గిరిజన ఉత్సవం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని తెరాస ఎంపీ సీతారాంనాయక్‌ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది భక్తులు తరలివచ్చి బంగారం(బెల్లం) మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. ఈ జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, 12వ శతాబ్దం నుంచే ఆదివాసీలు మేడారం ఉత్సావాన్ని నిర్వహిస్తున్నారని పెర్కోన్నారు. ఈ ఆంశాలన్ని పరిగణనలోకి తీసుకొవాలని సీతారాంనాయక్‌ కోరారు.