మేనిఫెస్టోలో చెప్పని అంశాలను

మలు చేస్తున్నాం-మంత్రి జగదీశ్‌

హైదరాబాద్‌,ఆగస్టు28 : రాష్ట్రంలో అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని రాష్ట్ర మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామంలో పర్యటించిన ఆయన, పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సైన్స్‌ ల్యాబ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అదే గ్రామంలో పలువురు లబ్దిదారులకు గొర్రెలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల ప్రణాళికలో చెప్పని అంశాలను కూడా అమలు చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా టేకుమట్ల సర్పంచ్‌, మాజీ సర్పంచ్‌ తో పాటు 200 మంది కార్యకర్తలు మంత్రి జగదీశ్‌ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలు పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌ లో చేరుతున్నారని మంత్రి జగదీశ్‌ చెప్పారు.