మేము శాంతికాముకులం.. పాక్‌తో అదే కోరుకుంటాం
రాజ్‌నాథ్
న్యూఢిల్లీ,సెప్టెంబర్11 (జనంసాక్షి):
పొరుగుదేశాలతో భారత్ ఎప్పుడూ శాంతి కోరుకుంటున్నదని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శాంతికాముక భారత దేశం మరోసారి భారత్-పాక్ సరిహద్దుల్లో శాంతి స్థాపనకు చర్యలు చేపట్టింది. ఈమేరకు శుక్రవారం పాకిస్థాన్ రేంజర్లతో కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. పాక్ రేంజర్లకు డైరెక్టర్ జనరల్ మేజర్ ఉమర్ ఫరూఖ్ బుర్కి ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎప్పుడూ తొలి బుల్లెట్ కాల్చబోదని స్పష్టం చేశారు. తాము ఎప్పుడు పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటామన్నారు. ఉగ్రవాదంపై ఇరు దేశాలు కలిసికట్టుగా పోరాడాల్సి ఉందని, అందుకు సహకరించాలని రాజ్‌నాథ్ కోరారు. పాకిస్థాన్ డీజీ మేజర్ బుర్కి మాట్లాడుతూ.. తాను రాజ్‌నాథ్ సింగ్‌లా కేంద్ర మంత్రి ¬దాలో ఉన్న వ్యక్తిని కాదని, తమ వైపు నుంచి ఎలాంటి హావిూ ఇవ్వలేనని పేర్కొన్నారు. భారత్ పేర్కొన్న అంశాలను పాక్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.