మేరా దేశ్ మేరా మాటీ అను కార్యక్రమము నిర్వహించిన బిజెపి నాయకులు..

ధర్మపురి (జనం సాక్షి)ఆనాటి స్వాతంత్ర పోరాట ప్రతిమను ముందు తరం వారికి తెలియజేయడం కోసం అలాగే స్వాతంత్ర సమర యోధులను స్మరించు కోవడం కోసం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమృత్ మహోత్సవం పేరిట ఉత్సవాలు నిర్వహిస్తోందని మేరా దేశ్ మేరా మాటీ కన్వీనర్ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కస్తూరి సత్యం అన్నారు. మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరంలు అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇట్టి కార్యక్రమంలో భాగంగా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో మేరా దేశ్ మేరా మాటీ అను కార్యక్రమము నిర్వహించబడినది ఈ సందర్భంగా BJP అసెంబ్లీ కన్వీనర్ కస్తూరి సత్యం మాట్లాడుతూ, ఏడు మండలాల నుండి సేకరించి తీసుకువచ్చిన కలశాల నుండి మట్టి తీసి ఒక కలశాన్ని ఢిల్లీకి పంపించబడును ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సేకరించిన మట్టిని ఒకచోట చేర్చి స్వాతంత్ర సమరయోధుల సంస్మరణార్థం స్మృతి వనం ఢిల్లీలో నిర్మించబడుతుంది అని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కస్తూరి సత్యం, అసెంబ్లీ కో కన్వీనర్ బండారి లక్ష్మణ్, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్, మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు మరియు MPTC చింతకింది అనసూర్య, జిల్లా అధికార ప్రతినిధి మర్రిపల్లి సత్యం, ఆకుల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు సంగేపు గంగారం, గంగుల కొమురెల్లి, మండల ప్రధాన కార్యదర్శి కుమ్మరి తిరుపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుమందాసు సత్యనారాయణ, నెల్లి చందు తదితరులు పాల్గొన్నారు.