మైక్రోసాఫ్ట్ విస్తరణకు హైదరాబాద్ అనుకూలం
సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్ భేటీ
న్యూయార్క్,మే19(జనంసాక్షి): అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ అభివృద్ధి, విస్తరణ గురించి సత్యనాదెళ్ల, కేటీఆర్ చర్చించారు. సత్యనాదెళ్ల తెలుగువారన్న సంగతి తెలిసిందే. అమెరికాలో పర్యటిస్తున్న కేటీఆర్ పలు ఐటీ కంపెనీలు, సీఈఓలను కలిశారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట విస్తరణ చేప్టటాలని కోరారు. దీనిని పరిశీలిస్తానని అన్నారు. సియాటెల్ నగరంలోని మైక్రోసాప్ట్ ప్రధాన కార్యాయానికి వెళ్లిన మంత్రి ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పరస్పరం కలిసి పనిచేసే అంశాలపై ఇరువురు చర్చించారు. ఐటీ పరిశ్రమకు తామిస్తున్న ప్రాధాన్యతను వివరించిన కేటీఆర్… రాష్ట్రంలో మైక్రోసాప్ట్ సేవలు విస్తరించాలని సత్య నాదెళ్లను కోరారు.