మైనారిటీ మంత్రం

జగన్‌ ప్రభావం తగ్గించేందుకు కాంగ్రెస్‌ యాక్షన్‌ ప్లాన్‌ రాష్ట్రానికి ముస్లిం, క్రైస్తవ మత ప్రముఖులు రాక? మైనారిటీలకు కాంగ్రెస్‌ ఒక్కటే రక్షణ ఇస్తుందన్న వాదన
జగన్‌ ఓటేస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందన్న వాదన
ఇప్పటికే అనిల్‌కు కౌంటర్‌ ఇస్తున్న క్రైస్తవ సంఘాలు
త్వరలో భారీ సభ?… ఎన్నికల్లోగా తెరపైకి క్రైస్తవ పార్టీలు
హైదరాబాద్‌,జనంసాక్షి: రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు తన మర్గంలో ఉన్న అవరోధాలు తొలగించుకునేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం ప్రణళిక సిద్దం చేసుకుంటోంది.అందులో భాగంగా, జగన్‌ సారధ్యంలోని వైఎస్సార్‌ సీపీ వైపు చూస్తున్న మైనారిటీలను తిరిగి కాంగ్రెస్‌ వైపు మల్లీంచే మాస్టర్‌ప్లాన్‌కు పదునుపెడుతుంది ముస్లిం క్రైస్తవులను పూర్తి స్థాయిలో తిరిగి తన గూటికి తీసుకు వచ్చే ప్రణళికకు ఊపిరిపోయనుంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియగాంధీ, అహ్మద్‌పటేల్‌ తదితర నేతలు ఈవ్యూహానికి పదునుపెడుతున్నట్లు తెలిసింది. ముస్లిం-క్రైస్తవులు అత్యధికంగా అభిమానించే వైఎస్‌ రాజాశేఖర్‌ రెడ్డి మరణం ఆయన తనయుడైన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్థాపించింన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వరంలా మారింది. వైఎస్‌ జీవించినప్పుడు ముస్లింలకు రిజర్వేషన్‌ ఇవ్వడంతో చాలా మందికి విద్య, వైద్య, ఉద్యోగ రంగల్లో అవకాశాలు రావడం, స్వయంగా వైఎస్‌ కుటుంబాన్ని క్రైస్తవులు తమ వాడిగా భావించడంతో ఆ రెండు వర్గాల జగన్‌ సార్టీకి మానసిక మద్దతుదారుగా మారాయి.
ఈరెండు వర్గాలతో పాటు దళిత క్రైస్తవులు కూడా జగన్‌ పార్టీకి మాసిక మద్దతు దారుగా మారే పరిస్థితి ఏర్పడింది. గత ఉప ఎన్నికల్లో దీని ప్రభావం బాగానే కనిపించింది. జగన్‌ ఓదార్పు, షర్మిల పాదయాత్రలో క్రైస్తవ నాయకులు చురుకుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అటు జగన్‌బావ, క్రైస్తవ మత ప్రచారకుడయిన బ్రదర్‌ అనిల్‌కుమార్‌ కూడ జగన్‌ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.
అందులో భాగంగా అయన కూటములు నిర్వహిస్తున్నారు. ఇటీవలె లోటస్‌పాండ్‌లో అయన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫాదర్లు, ఫాస్టర్లతో ఒక సమవేశం నిర్వహించరు. జగన్‌ పార్టీకి మద్దతుఇవ్వలని, మీకు కావలసిన సాయం చేస్తామని హమీనిచ్చారు. తనకు ఇద్దరు భార్యలున్నమాట వాస్తవమేనని, తన పెద్ద కుమర్తె కూడా సువార్త చదువుతుందని చెప్పారు.