మొదటి సారి విక్రమ్‌ను ఫోటో తీసిన ప్రజ్ఞాన్
బెంగళూరు(జనంసాక్షి): సూర్యుడి అధ్యయనం కోసం చేపట్టే ఆదిత్య`ఎల్ మిషన్ ప్రయోగం కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. పీఎస్‌ఎల్వీ సీ 57 రాకెట్ ద్వారా ఆదిత్యను నింగిలోకి పంపనున్నారు. అయితే ఆ మిషన్ లాంచింగ్‌కు ముందు చేపట్టే రిహార్సిల్స్ అన్నీ పూర్తి అయినట్లు ఇస్రో తన ట్వీట్‌లో తెలిపింది. ఆదిత్య`ఎల్1 మిషన్‌కు చెందిన అన్ని వెహికల్ ఇంటర్నల్ చెక్స్‌ను పూర్తి చేసినట్లు కూడా ఇస్రో చెప్పింది. ఆదిత్య`ఎల్1 స్పేస్‌క్రాప్ట్‌కు చెందిన కొన్ని ఫోటోలను ఇస్రో తన సోషల్ విూడియా అకౌంట్‌లో పబ్లిష్ చేసింది. ఇదిలావుంటే చంద్రయాన్ 3 కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది ఇస్రో. చంద్రుడి సౌత్‌పోల్‌పై ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి డేటాని పంపిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండర్ విక్రమ్‌ని ఫొటో తీసి పంపింది. నావిగేషన్ కెమెరాతో ఈ ఫొటో క్లిక్ చేసింది. చంద్రుడిపై ల్యాండ్ అయిన తరవాత ప్రజ్ఞాన్ రోవర్ తీసిన తొలి ఫొటో ఇదే. ఇప్పటి వరకూ అక్కడి నుంచి వచ్చిన ఫొటోలు, వీడియోలు అన్నీ ల్యాండర్ విక్రమ్ తీసినవే. ఇదే విషయాన్ని ఇస్రో అధికారికంగా వెల్లడిరచింది. ట్విటర్‌లో విక్రమ్ ల్యాండర్ ఫొటోని షేర్ చేసింది. రోవర్‌పై ఉన్న నావిగేషన్ కెమెరాని బెంగళూరుకి చెందిన కంపెనీ తయారు చేసింది. ఇప్పటికే చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి కీలక వివరాలు అందిస్తోంది చంద్రయాన్ 3. ప్రపంచ దేశాల్లో ఎవరి వద్దా లేని అత్యంత అరుదైన ఫొటోలు తమ వద్ద ఉన్నాయని ఇటీవలే ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ వెల్లడిరచారు.