మొరాకో 15మంది యువకులకు రేబిస్‌

– గాడిదతో లైంగింక చర్యే కారణం!
– సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వార్త
మొరాకో, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : ఇదో షాకింగ్‌ న్యూస్‌.. మొరాకోలో జరిగిన ఈ ఘటన కొందరు యువకుల కుటుంబాలకు తీరని బాధ, భయాన్ని మిగిల్చింది. మొరాకో గ్రావిూణ ప్రాంతానికి చెందిన 15మంది యువకులు ఓ గాడిదతో లైంగిక చర్యకు పాల్పడ్డారు. దీంతో వారికి రేబిస్‌ వ్యాధి సోకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు ఆ యువకులను హుటాహుటీన ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. మెచ్రా బ్లెక్‌సిరి ఆస్పత్రిలో వారం రోజుల పాటు ఉన్న ఆ యువకులకు వైద్యులు రేబిస్‌ వ్యాక్సిన్‌ అందించారు. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా ఈ వార్త వైరల్‌ అయింది.
మరోపక్క మొరాకోలోని అధికారులు ఘటన జరిగిన గ్రామానికి వెళ్లి, ఇంకెవరైనా రేబిస్‌ వ్యాధితో బాధపడుతున్నారా? అనే దానిపై ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా రేబిస్‌ వ్యాధి సోకిన జంతువులను గుర్తించి వాటిని కబేళాలకు తరలించాలని, వాటి మాంసాన్ని కూడా విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొరాకో సవిూపంలోని చిన్నపట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఆ యువకుల కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. ఇటీవల ఫ్లోరెడాలోకి ఓక్లోసా కౌంటీకి చెందిన ఓ వ్యక్తి గుర్రంతో లైంగిక చర్యకు పాల్పడి సంచలనం సృషించాడు. ఈ సంఘటన అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డయింది.