మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపిన వీఆర్ఏలు
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): సీఎం కేసీఆర్ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 27వ రోజుకి చేరుకుంది.వీఆర్ఏల రాష్ట్ర జేఏసి పిలుపు మేరకు ఆర్డీఓ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు వినూత్న రీతిలో మోకాళ్ళపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వీఆర్ ఏ ల స్టేట్ జనరల్ సెక్రటరీ మీసాల సునీల్ గావాస్కర్ మాట్లాడుతూ సీఎం కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తూ వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేస్తూ రాష్ట్రంలో ఉన్న 23వేల మంది వీఆర్ఏ లకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.వీఆర్ఏ లకు పే స్కేల్, ప్రమోషన్స్ , 55 ఏళ్లు పైబడిన విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి 22 నెలలు కావస్తున్న హామీలు అమలు కాలేదన్నారు.తమ సమస్యలను వెంటనే పరిష్కరించి విఆర్ఏల జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.హామీలు అమలయ్యేంత వరకు దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వీఆర్ఏల సంఘము కో చైర్మన్ మామిడి సైదులు, శ్రీనివాసులు , తండు నగేష్ , సంతోష్ రెడ్డి , నజీర్ , శ్రీను, నాగరాజు , మాధవి, రూప, రాజ్యలక్ష్మి , సైదమ్మ, సునీత , చైతన్య , సరిత, నస్రీన్, వెంకన్న, లింగయ్య, జానయ్య తదితరులు పాల్గొన్నారు.