మోడల్ ప్లాంటేషన్‌గా లింగంపేట
నిజామాబాద్,ఆగస్ట్3(జనం సాక్షి): ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలోని లింగంపేటను మోడల్ ప్లాంటేషన్‌గా ఎంపిక చేసినట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రమకాంత్ తెలిపారు.కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 20 లక్షల ఈత మొక్కలు నాటడమే లక్ష్యమని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో ఈత మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. లింగంపేట డిపో పరిధిలో 860 మొక్కలు, ఉమ్మడి జిల్లాలో 5 లక్షల 62వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్, మోర్తాడ్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బిచ్కుంద, దోమకోండ మండలాల స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో మోడల్ ప్లాంటేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోడల్ స్లాంటేషన్‌లో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు నీటి సరఫరా కోసం 90 శాతం రాయితీపై డ్రిప్ పరికరాలు అందిస్తున్నట్లు వివరించారు.