మోడీ, అమిత్ షా లు కేసీఆర్ పై విషం చిమ్ముతున్నారు

గుజరాత్ లోనే ఆయనను నిలదీస్తున్నారు
– మంత్రి జగదీష్ రెడ్డి
 నల్గొండ బ్యూరో,జనం సాక్షి.
 ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ఉద్దేశపూర్వకంగా సీఎం కేసీఆర్ పై విషం చిమ్ముతున్నారని  రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంతకండ్ల జగదీష్  రెడ్డి విమర్శించారు. శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలో తెరాస పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ  సమ్మేళనం  కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనే ప్రజలు నిలదీస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాలు తమ రాష్ట్రంలో ఎందుకు  అమలు చేయడం లేదని  వేసే ప్రశ్నలకు ప్రధానమంత్రి మోడీ దగ్గర జవాబు లేక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై విషం చిమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. గుజరాత్ రాష్ట్రంలో  రైతులకు ఇచ్చే ఆరు గంటల కరెంటుకు కూడా మీటర్లు పెట్టి బిల్లులు చేస్తున్నారని,  తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్  అన్నదాతలకు 24 గంటలు ఉచిత  అందిస్తున్నారని మీరు ఎందుకు ఇవ్వరని బిజెపి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్నారని  అన్నారు. దేశంలో ఏ ప్రాంతంలో కూడా తలెత్తుకో లేని పరిస్థితిలో బిజెపి నేతలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. కెసిఆర్ పర్యటన సమయంలో  అన్ని రాష్ట్రాల ప్రతినిధులు  తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు పడుతున్నారని వివరించారు.  రాజగోపాల్ రెడ్డి అనే దొంగను మునుగోడు శాసనసభ్యుడి పదవికి రాజీనామా చేయించి ఉద్దేశపూర్వకంగా ఎన్నికలు నిర్వహించి లబ్ధి పొందాలని బిజెపి కుట్ర పన్నిందని  మునుగోడు ప్రాంత ఓటర్లను ప్రలోభాలకు ఆశపెట్టి గెలుపొందాలని చూస్తున్నారని  మునుగోడు ప్రజలు వివేకవంతులని  బిజెపి మాయలో పడరని ధీమా వ్యక్తం చేశారు.  మునుగోడులో ప్రచారానికి వచ్చే బిజెపి నేతలను తరిమికొట్టాలని, ఎన్నికల్లో  వారిని తుక్కుగా ఓడించాలని మంత్రి పిలుపునిచ్చారు. తెరాస కార్యకర్తలు త్యాగాలు చేస్తూ  గులాబీ జెండా కప్పుకుని  గ్రామాలను అభివృద్ధి బాట పట్టిస్తున్నారు.  గులాబీ జెండా కప్పుకుని అభివృద్ధి లో తాము కూడా భాగం అవుతున్నామని సంతోషపడుతున్నారన్నారు. జననేత ముఖ్యమంత్రి కేసీఆర్  అద్భుతమైన పాలన అందించి దేశంలోనే  నెంబర్ వన్ స్థాయిలో నిలిపారని అన్నారు. కెసిఆర్ సచ్చుడో తెలంగాణ ఇచ్చుడో అని నినదించి   14 ఏళ్ల  సుదీర్ఘ పోరాటం చేసి  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్  సాధించిన తెలంగాణలో సబ్బండ వర్గాల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజలు కేసీఆర్ ను ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేశారన్నారు. తన అద్భుతమైన పాలనతో దేశంలో అత్యధిక వ్యవసాయ దిగుబడులు సాధించి  రికార్డ్ సృష్టించిందని  పేర్కొన్నారు.  ఆనాడు ఫ్లోరిన్ మహమ్మారితో మునుగోడు నియోజకవర్గం  పడిందని ఆనాడు ఎవరూ పట్టించుకోలేదని… తెలంగాణ సాధించిన అనంతరం  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి మిషన్ భగీరథ పథకానికి ఇక్కడే స్వీకారం చుట్టి ఫ్లోరైడ్ ను  తరిమికొట్టిన మహా వ్యక్తి  కెసిఆర్ అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  చేసిన కృషితో ఇప్పుడు మునుగోడులో ఎటు చూసినా సస్యశ్యామలంగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో  జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ  తక్కలపల్లి రవీందర్రావు, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  స్థానిక ప్రజాప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.
Attachments area