మోడీ ప్రభుత్వంపంపిణీ చేస్తున్న  రేషన్

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి:మీరు ఇవ్వరు ఇచ్చిన బియ్యం పంచరు

బూర్గోజు నాగరాజు
బిజెపి నాయకులు
కొమురవెల్లి జనం సాక్షి

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని వెంటనే పంపిణీ ప్రారంభించాలి సంక్రాంతి పండుగకి సమయం దగ్గర పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈనెల రేషన్ బియ్యం పంపిణీని ఇంకా మొదలు పెట్టలేదని పేదల కోసం కేంద్ర ప్రభుత్వం పంపిన బియ్యాన్ని పంపిణీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన బియ్యం స్టాక్ ను రేషన్ షాపులకు పంపకుండా జాప్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఒకటో తేదీన పంపిణీ  చేయాల్సిన రేషన్ బియ్యం పది రోజులు కావస్తున్న ఇంకా పంపిణీ చేయకపోవడం సరైనది కాదన్నారు. ప్రభుత్వం ఇచ్చే బియ్యం సరుకులు తిండితోపాటు పిండివంటలకు పనికొస్తాయని సంక్రాంతి పండగ ఉండడం వలన లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారని . కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దీనికి మరో ఆరు కిలోలు కలిపి మొత్తంగా 11 కిలోల రేషన్ బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 10 కిలోలు మాత్రమే ఇస్తుందని అన్నారు.నేటి వరకు రాష్ట్రంలో రేషన్ కార్డులు 92 లక్షలు ఉండగా కోటి 70 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని వీరంతా రేషన్ బియ్యం కొరకు ఎదురుచూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 17,900 రేషన్ షాపుల ద్వారా ప్రతినెల సరుకులు సమయానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.