మోడీ హయాంలో పెరిగిన మూకహత్యలు
మండిపడ్డ కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ
న్యూఢల్లీి,డిసెంబర్21( జనం సాక్షి): కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాక ముందు మూక హత్యల ఘటనల గురించి వినేవారం కాదని అన్నారు. మోదీ సర్కార్ కొలువుతీరక ముందు మూక దాడుల మాటే వినలేదని థ్యాంక్యూమోదీజీ అంటూ రాహుల్ మంగళవారం ట్వీట్ చేశారు. రాహుల్ ట్వీట్‌పై బీజేపీ నేత అమిత్ మాలవీయ మండిపడ్డారు. సిక్కుల ఊచకోతను సమర్ధిస్తూ మూకహత్యలకు రాహుల్ తండ్రి లాంటి వాడని ఎదురుదాడికి దిగారు. సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన మారణహోమాన్ని కాంగ్రెస్ సమర్ధించిందని,
కాంగ్రెస్ పార్టీ సిక్కు పురుషుల మెడకు కాలుతున్న టైర్లను చుట్టిందని, కాల్వల్లో పడేసిన దగ్ధమైన మృతదేహాలను కుక్కలు పీక్కుతిన్నాయని మాలవీయ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత పంజాబ్‌లో సిక్కుల ప్రార్ధనాలయాలను అపవిత్రం చేశారని ఇద్దరు వ్యక్తులను కొందరు కొట్టిచంపిన ఘటన అనంతరం రాహుల్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం. మరోవైపు ప్రార్ధనాలయాలను అపవిత్రం చేసేవారిని బహిరంగంగా ఉరితీయాలని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. ఇక గురుద్వారను అపవిత్రం చేసిన ఘటనను పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ఖండిరచారు. అయితే మూక హత్యలపై మాత్రం ఆయన నోరుమెదపలేదు.