మోతలు లేని ప్రభు బండి

C

ప్రగతి దిశగా భారతీయ రైల్వేల ప్రయాణం

సవాళ్లను ఎదుర్కొంటాం

2016-17 రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సురేశ్‌ ప్రభు

న్యూఢి,ఫిబ్రవరి 25(జనంసాక్షి): సవాళ్లను అధిగమిస్తూ  భారీతీయ రైల్వేలను ప్రగతి వైపు పరిగెత్తిస్తామని కేంద్ర రైల్వేశాఖమంత్రి సురేశ్‌ ప్రభు ప్రకటించారు. లోక్‌సభలో గురువారం  2016-17 రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. పరిశుభ్రత, రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తామని ఆయన తెలిపారు.  రైల్వేల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని సురేశ్‌ ప్రభు పేర్కొన్నారు. వరుసగా రెండోసారి ఆయన రైల్వే బడ్జెట్‌ను లోక్‌ సభలో ప్రవేశపెట్టారు.  ప్రతి పౌరుడు గర్వపడేలా రైల్వే ప్రయాణాన్ని తీర్చిదిద్దుతామని ఆ సందర్భంగా ప్రకటించారు. రైల్వేల ప్రణాళికా వ్యయం రూ. 1.21 లక్షల కోట్లుగా ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాదికల్లా రైల్వేలలో 92 శాతం ఆక్యుపెన్సీ రేషియోను సాధిస్తామని సురేశ్‌ ప్రభు చెప్పారు.  ఈసారి మొత్తం 1.50 లక్షల కోట్లను ఎల్‌ఐసీ సంస్థ పెట్టుబడిగా పెడుతోందని చెప్పారు. రోజుకు 7 కిలోవిూటర్ల చొప్పున ఈ ఏడాది 2800 కిలోవిూటర్ల ట్రాక్‌ను బ్రాడ్‌గేజిగా మారుస్తామని తెలిపారు. తద్వారా మొత్తం 9 కోట్ల పనిదినాల ఉపాధి కల్పన జరుగుతుందని తెలిపారు. మన ప్రయాణంలో మార్పునకు ఈ బడ్జెట్‌ సాక్ష్యంగా నిలుస్తుందని కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు అన్నారు. దేశంలోని మిలియన్ల కొద్దీ సామాన్యులను తాకుతూ ఈ ప్రయాణం ఉంటుందన్నారు. ప్రస్తుతం రైల్వే శాఖ సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సవాళ్లకు భయపడబోమని ధైర్యంగా ఎదుర్కొంటామని పేర్కొంటూ ఆయన మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మాటల్ని ఉదహరించారు. కష్టాలు వస్తూనే ఉంటాయి… ముందుకు సాగుతూనే ఉంటాం… అని ప్రభు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మేకిన్‌ ఇండియాకు అనుగుణంగా రెండు లోకో ఫ్యాక్టరీలను నెలకొల్పుతామని, దీనివల్ల ఉద్యోగ కల్పన కూడా పెరుగుతుందని ఆయన ప్రకటించారు. పారదర్శకతను మరింత పెంచేందుకు సోషల్‌ విూడియాను ఉపయోగించుకుంటున్నామన్నారు. ఐవీఆర్‌ఎస్‌ సిస్టంతో ప్రయాణికుల నుంచి రోజుకు లక్షకు పైగా కాల్స్‌ వస్తున్నాయని, మహిళలు, ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా ఇది ఉపయోగపడుతోందని చెప్పారు. ఇప్పుడు రైల్వే మంత్రికి, సామాన్య ప్రయాణికుడికి ఏమాత్రం తేడా లేదని ఆయన అన్నారు.  రైల్వే మంత్రిగా తాను చాలా ప్రాంతాలకు వెళ్లి చాలామందిని కలిశానని, అందులో భాగంగానే ముంబై సెంట్రల్‌ కు వెళ్లినప్పుడు ఓ మహిళ అక్కడి స్టేషన్‌ను శుభ్రం చేస్తున్నారని రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు తెలిపారు.  గత 5 నెలలుగా ఆమె స్వచ్ఛందంగా ఈ సేవలు చేస్తున్నారని, ప్రజల్లో ప్రతి ఒక్కరూ రైల్వేలను తమ సొంత సంస్థ అనుకోవడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. రైల్వేలు అందరివీ.. అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఆదాయాన్ని పెంచుకోవడం పై రైల్వేశాఖ దృష్టిపెట్టిందని, కొత్త వనరులవైపు దృష్టి సారిస్తున్నామని అన్నారు. ఖర్చుపెట్టే ప్రతి ఒక్క రూపాయి వల్ల ప్రయోజనం ఉండేలా చూస్తున్నామని చెప్పారు. సామర్థ్యాన్ని పెంచుకుంటున్నామని, అంతర్జాతీయంగా ఉన్న మంచి విధానాలను అనుసరిస్తున్నామని అన్నారు.  దేశ ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌ సిద్ధం చేశామని తెలిపారు. అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తామని సురేశ్‌ ప్రభు పేర్కొన్నారు.  ప్రయాణికుల నుంచి నేరుగా సలహాల కోసం ప్రత్యేక ఐవీఆర్‌ఎస్‌ నంబర్‌ ప్రవేశపెడుతామని వెల్లడించారు. సాధారణ ప్రయాణికులు, రైల్వేకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేకుండా చూస్తున్నామని తెలిపారు. ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి డిస్పోజబుల్‌ బెడ్‌ షీట్లు ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగా 74 రైళ్లలో ఆన్‌బోర్డ్‌ హౌస్‌కీపింగ్‌ సేవలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. 2015-16లో ఇంధన ఆదాతో రూ. 8,720 కోట్లు మిగిలాయన్నారు. ప్రతి రైలులో వృద్ధులు, మహిళల కోసం 120 లోయర్‌ బెర్తులు ఏర్పాటు చేస్తామన్నారు. పీపీపీ విధానంలో 400 స్టేషన్ల ఆధునీకరణ చేస్తామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రైల్వేల ఆధునీకరణకు రూ. 8.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. పారదర్శకతను పెంచేందుకు సామాజిక మాధ్యమం వినియోగంలోకి తెస్తామన్నారు. రైలు ప్రమాదాల నివారణకు కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తామన్నారు. 311 రైల్వే

స్టేషన్లలో పూర్తిగా సీసీ కెమెరాలు అమర్చాం. దశలవారీగా అన్ని స్టేషన్లలో సీసీ కెమెరాలు అమర్చుతాం. గతేడాదితో పోల్చితే ప్రమాదాలు 20 శాతం తగ్గించగలిగామని స్పష్టం చేశారు.  రైల్వే వ్యవస్థలో 2017-18లో 9 వేల ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని  ప్రకటించారు. వచ్చే ఏడాది 2 వేల కిలోవిూటర్ల రైల్వే మార్గాలను విద్యుదీకరిస్తామని చెప్పారు. రోజుకు 7 కి.విూ. రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. రూపాయి ఖర్చుతో రూ. 5 వృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఢిల్లీ – చెన్నై, ఖరగ్‌పూర్‌ -ముంబై, ఖరగ్‌పూర్‌-విజయవాడ సరకు రవాణా మార్గాలు ఏర్పాటు చేస్తామన్నారు. 7,517 కిలోవిూటర్ల మేర సముద్ర తీర ప్రాంతంలో కనెక్టివిటీ విస్తరణ చేస్తామన్నారు. మిజోరం-మణిపూర్‌ రైల్వే లైన్‌ను బ్రాడ్‌గేజ్‌గా మారుస్తామని వెల్లడించారు. భారత్‌లో తయారీలో భాగంగా కొత్త లోకో ఫ్యాక్టరీలు నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఆరేళ్లలో సగటున రోజుకు 4.3 కి.విూ. మేర బ్రాడ్‌గేజ్‌ లైన్‌ నిర్మించామని తెలిపారు. అన్ని విభాగాల్లో కాగిత రహిత ఎలక్టాన్రిక్‌ వ్యవస్థ దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఆశాన్య భారతంతో లింక్‌

ఈశాన్య భారత దేశాన్ని మిగిలిన ప్రాంతాలతో కలపడం ప్రభుత్వ అత్యధిక ప్రాధాన్య అంశం అని కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు తెలిపారు. దీనికోసం ఇక్కడ బ్రాడ్‌గేజ్‌ పనులను ప్రారంభిస్తాం. అసొమ్‌లోని లుమ్‌డిండ్‌-సిల్‌చార్‌ సెక్షన్‌ను ప్రారంభించి బరాక్‌ ప్రాంతాన్ని దేశంతో కలుపుతాము.  రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కొత్త ప్రాజెక్టులు చేపడతామని అన్నారు. రైల్వేలను పునర్‌ వ్యవస్థీకరించాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు అన్నారు. గత సంవత్సరం మధ్యకాలిక ప్రణాళికతో బడ్జెట్‌ ప్రవేశపెట్టాను.. ఈ సారి పునర్‌ వ్యవస్థీకరణపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది అని ఆయన అన్నారు.

భారతీయులంతా గర్వపడే రైల్వే వ్యవస్థ

భారతీయులంతా గర్వపడే రైల్వే వ్యవస్థను అందించాల్సిన అవసరం ఉందన్నారు. సేవల నుంచి సౌకర్యాల వరకు అన్ని విభాగాల్లో రైల్వే ముందంజ వేయాల్సి ఉందని పేర్కొన్నారు. భద్రతా ప్రమాణాల పెంపు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుంటున్నామని చెప్పారు. గతేడాది బడ్జెట్‌లో ప్రకటించిన 139 అంశాల్లో కార్యాచరణ ప్రారంభించామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రూ. 1.5 లక్షల కోట్లు పెట్టేందుకు ఎల్‌ఐసీ అంగీకరించిందని పేర్కొన్నారు. అందరితో చర్చించిన తర్వాతే బడ్జెట్‌కు రూపకల్పన చేశామని స్పష్టం చేశారు. ఈ రైల్వే బడ్జెట్‌ సామాన్య ప్రజల ఆశలు ప్రతిబింబించే బడ్జెట్‌ అని కేంద్ర రైల్వే శాఖ మంత్రిసురేశ్‌ ప్రభు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో మార్పులు ఉన్నాయి. రాబడి పెంపుదల కోసం సంప్రదాయ ఆలోచన విధానాలు వదలి కొత్తగా ఆలోచిస్తున్నామని చెప్పారు. ఛార్జీలు పెంచితేనే ఆదాయం అనే విధంగా కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నామని తెలిపారు. బడ్జెట్‌ ద్వారా రైల్వేలకు రూ.10 వేల కోట్లు సమకూరుతుందని రైల్వేమంత్రి సురేష్‌ ప్రభు అన్నారు. 5 ఏళ్లలో 8.5 లక్షల కోట్లతో రైల్వేల ఆధునీకరణ చేస్తామని ఆయన అన్నారు. రూ.40 వేల కోట్లతో రెండు లోకో ప్రాజెక్టులు చేపడుతున్నామని సురేష్‌ ప్రభు తెలిపారు. అంతేకాకుండా రైల్వే ప్రయాణికులకు రూ.30 వేల కోట్ల సబ్సిడీ ఇస్తున్నామని సురేష్‌ ప్రభు అన్నారు. తిరుపతి లాంటి యాత్ర స్థలాలకు సర్క్యూట్‌ రైళ్లు ఏర్పాటు చేస్తామని  తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్‌లో సబ్‌ అర్బన్‌ నెట్‌వర్క్‌ విస్తృతికి చర్యలు చేపడతామని సురేష్‌ ప్రభు చెప్పారు. రైల్వే కోచ్‌లలో ఇకపై జీపీఎస్‌ సిస్టం ఏర్పాటు చేస్తామని ప్రభు తెలిపారు. పార్లమెంట్‌ లో రైల్వే బడ్జెట్‌ ప్రసంగంలో నాగ్‌పూర్‌- విజయవాడ ట్రేడ్‌ కారిడార్‌ పూర్తి చేస్తామని రైల్వేమంత్రి సురేష్‌ ప్రభు అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హావిూలను నెరవేరుస్తుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కు రైల్వే బడ్జెట్‌ లో సముచిత ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. అంతేకాకుండా దేశంలో ప్రధాన పోర్టులకు రైల్వే కనెక్టివిటీ పెంచుతామని సురేష్‌ ప్రభు చెప్పారు. ఈ రైల్వే కనెక్టివిటీ ద్వారా ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. ఈ చర్యల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక ప్రగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

మహిళలకు ప్రత్యేక కోటా

రైల్వే టికెట్‌ రిజర్వేషన్లలో మహిళలకు ఇక నుంచి ప్రత్యేక కోటా లభించనుంది. రిజర్వేషన్‌ టికెట్లలో మహిళలకు ప్రత్యేకంగా 33 శాతం సబ్‌-కోటాను ప్రవేశపెట్టనున్నారు.  రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ మంత్రి సురేశ్‌ ప్రభూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రయాణికులకు ప్రాంతీయ వంటలు కూడా అందించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధాన రైల్వే స్టేషన్లలో వీలైనన్ని వీల్‌ చైర్లు అందుబాటులో ఉండే విధంగా చూస్తామన్నారు. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు సుమారు రెండు వేల రైల్వే స్టేషన్లలో 20వేల స్కీన్ల్రను ఏర్పాటు చేయనున్నారు. రైలు ప్రయాణికుల ఫిర్యాదులను స్వీకరించేందుకు ఓ వ్యక్తి బాధ్యతలను అప్పగించనున్నారు. రైలులో కల్పించే అన్ని సేవలకు అతన్ని బాధ్యున్నిగా చేయనున్నారు. రైల్వే పోర్టర్లకు నూతన దుస్తులు అందించనున్నారు. వాళ్లను ఇక నుంచి సహాయకులుగా పిలువనున్నారు. ముంబైలో రెండు ప్రత్యేక కారిడార్‌లు ఏర్పాటు చేయనున్నారు. కాలుష్యం నుంచి విముక్తి కోసం ఢిల్లీ ప్రభుత్వం భాగస్వామ్యంతో కొత్త రైల్వే మార్గాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.

రైళ్లలో ఎఫ్‌ఎం సేవలు

రాజధాని, శతాబ్ది, అన్ని మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణికుల వినోదం కోసం ఎఫ్‌ఎం సేవలు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఎంపిక చేసిన రైళ్లలో స్మార్ట్‌ రైల్వే కోచ్‌లను తీసుకుని వస్తున్నామన్నారు. ఆధ్యాత్మిక కేంద్రాల రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కొత్త పథకం. మొదటి దశలోనే తిరుపతి రైల్వేస్టేషన్‌కు అవకాశం కల్పిస్తామన్నారు. రైల్వేస్టేషన్లలో పిల్లల కోసం బేబీపుడ్‌, వేడి పాలు, వేడి నీళ్లు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. పాలు, అత్యవసర మందులు కూడా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పాత్రికేయులకు రాయితీపాస్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్‌ బుకింగ్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఫ్లాట్‌ఫాం టికెట్‌ కొనుగోలుకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.  రైల్వేలో వంద శాతం పారదర్శకత సాధించడమే తమ లక్ష్యమని సురేశ్‌ ప్రభు తెలిపారు.కోపరేషన్‌, కొలాబ్రేషన్‌, కమ్యూనికేషన్‌- తమ కొత్త నినాదంగా పేర్కొన్నారు. రైళ్ల రాకపోకల్లో సమయపాలన కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. 17 రాష్ట్రాలతో ఉమ్మడి ప్రాజెక్టులపై అంగీకారానికి వచ్చామని తెలిపారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో 44 ప్రాజెక్టులు చేపట్టామని చెప్పారు. 5,300 కిలోవిూటర్ల మేర పనులు చేపట్టామని గుర్తు చేశారు.  ఈ ఏడాది వంద రైల్వే స్టేషన్లకు వై-్గ/ సేవలను అందించనున్నారు. రానున్న రెండేళ్లలో ఆ సంఖ్యను 400 రైల్వే స్టేషన్లకు విస్తరించనున్నట్లు రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు లోకసభలో తెలిపారు. రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ రైల్వే స్టేషన్ల సుందీకరణకు సామాజిక సంస్థలకు ఆయన ఆహ్వానం పలికారు. ఢిల్లీ-వారణాసి మధ్య మహనామా ఎక్స్‌ప్రెస్‌ను ఆధునిక వసతులతో కొత్తగా ప్రారంభించనున్నట్లు ఆయన

చెప్పారు. ఈ ఏడాది సుమారు వెయ్యి క్రాసింగ్‌ లెవల్లను ఎత్తివేసినట్లు తెలిపారు. కొత్తగా రిజర్వేషన్‌ లేని అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. కొన్ని రైళ్లలో దీన్‌దయాల్‌ జనరల్‌ బోగీలను ప్రవేశపెట్టనున్నారు. కోచ్‌లను శుభ్రపరిచేందుకు ఎస్‌ఎంఎస్‌ సేవలను కూడా ప్రారంభించనున్నారు. క్లీన్‌ మై కోచ్‌ సర్వీస్‌ను ప్రయాణికులు వాడుకోవచ్చన్నారు. ప్రధాన రైల్వే స్టేషన్లలో బార్‌కోడ్‌ టికెట్లను ప్రవేశపెట్టనున్నారు.

తెలంగాణకు మళ్లీ మొడిచేయి

ప్రతిపాదనలను పట్టించుకోని ప్రభు

కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు గురువారం లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన  సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్‌ సబర్బన్‌ నెట్‌వర్క్‌ విస్తృతికి చర్యలు చేపడతామని వెల్లడించారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు పరిశీలిస్తే…ఈ విధంగా ఉన్నాయి.  సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌కు రూ.80కోట్లు,  పెద్దపల్లి-నిజామాబాద్‌ లైన్‌కు రూ.70కోట్లు ,  మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ లైన్‌కు రూ.90 కోట్లు

మాచర్ల-నల్గొండ రైల్వే లైన్‌కు రూ.20కోట్లు , రాఘవపురం-మందమర్రి లైన్‌కు రూ.15కోట్లు , కాజీపేట-విజయవాడ మూడో లైన్‌కు రూ.114 కోట్లు, కాజీపేట-వరంగల్‌ మధ్య ఆర్‌ఓబీ నిర్మాణానికి రూ.5కోట్లు , పెద్దపల్లి-జగిత్యాల మధ్య సబ్‌వే నిర్మాణానికి రూ.5కోట్లు కేటియిస్తున్నట్లు ప్రకతించారు. అయితే కేటాయింపులపై తెలంగాణ ప్రతినిధులు పెదవి విరిచారు.  రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి కేంద్రం మొండి చేయి చూపింది. తెలంగాణకు ఈ సారి కూడా న్యాయం జరగలేదు. తెలంగాణ ప్రజానీకానికి మరోసారి నిరాశే ఎదురైంది. ఇచ్చిన హావిూలను గాలికి వదిలేసింది. కొత్త రైల్వే ప్రతిపాదనలను పట్టించుకోలేదు. కాజీపేట రైల్వే కోచ్‌ అంశాన్ని ప్రస్తావించనే లేదు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ పొడిగింపు ప్రస్తావనే లేదు. పెద్దపల్లి – కరీంనగర్‌- నిజామాబాద్‌, మనోహరాబాద్‌ – కొత్తపల్లి, భద్రాచలం – సత్తుపల్లి కొత్త లైన్ల కల సాకారం కాలేదు. రైల్వే బడ్జెట్‌ తెలంగాణ ప్రజానీకాన్ని నిరాశపర్చిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాకు అన్యాయం: జోగు రామన్న

రైల్వే బడ్జెట్‌లో ఆదిలాబాద్‌ జిల్లాకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి జోగు రామన్న విమర్శించారు. రైల్వే బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ… ఆదిలాబాద్‌ నుంచి రాష్ట్ర రాజధానికి రైల్వే అనుసంధానం లేదని, హైదరాబాద్‌కు అనుసంధానం లేని జిల్లాపై కేంద్ర చిన్న చూపు చూసిందన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాకు కొత్త లైన్లు కేటాయించలేదని, రాష్ట్ర ప్రతిపాదనలు రైల్వేశాఖ పరిగణనలోకి తీసుకోలేదని జోగు రామన్న విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సప్లమెంటరీ బడ్జెట్‌లో అయినా రాష్ట్ర ప్రాధాన్యతలు గుర్తించాలని కోరారు.

రైల్వే బడ్జెట్‌ అభివృద్ధి ఆధారిత బడ్జెట్‌

ఈ రైల్వే బడ్జెట్‌ అభివృద్ధి ఆధారిత బడ్జెట్‌ అని, ప్రజలకు జవాబుదారీగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మోదీ ప్రత్యక్షంగానూ, సామాజిక వెబ్‌సైట్ల ద్వారానూ స్పందించారు. ముందుగా రైల్వే కుటుంబానికి, సురేశ్‌ ప్రభుకి అభినందనలు తెలిపారు. రైళ్లల్లో సాంకేతికత వినియోగం పెంపొందించామని మోదీ అన్నారు. ఈ బడ్జెట్‌ దేశ నిర్మాణంలో కీలకం కానుందన్నారు. దేశ పునర్‌నిర్మాణానికి, భవిష్యత్‌ మార్గనిర్దేశకంగా ఇది ఉపయోగపడుతుందన్నారు. ఎక్కడా ఛార్జీలు పెంచకుండా పూర్తిగా వినియోగదారుడి ఆశలకు అనుగుణమైన బడ్జెట్‌ని తయారు చేశారని ప్రశంసించారు. పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఈ బడ్జెట్‌ ఉందన్నారు. ఇది తమ ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమని చెప్పారు. పునర్వ్యవస్థీకరణ, సంస్కరణల ద్వారా ప్రయాణికులపై భారం పడకుండా ఆదాయ వనరుల్ని పెంచే పక్రియకు ఈ బడ్జెట్‌ నాంది పలికిందని ప్రశంసించారు. రిజర్వేషన్లు లేకుండా సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లను ప్రారంభించడం వెనక ఉద్దేశం పేదలకు సేవ చెయ్యడమేనన్నారు. ఈశాన్య రాష్టాల్రైన మణిపూర్‌, మిజోరాంలకు రైల్వే సేవల్ని విస్తృతం చెయ్యడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇదిలావుంటే బడ్జెట్‌పై బిజెపితో పాటుకేంద్రమంత్రులు కూడా ఆనందం

వ్యక్తం చేశారు. అభివృద్ది కారక బడ్జెట్‌ అన్నారు.  రైల్వే బడ్జెట్‌ ప్రయాణికుల సంతృప్తిపై దృష్టిసారించేలా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రైల్వేడ్జెట్‌పై వెంకయ్యనాయుడు విూడియాతో మాట్లాడుతూ… బడ్జెట్‌లో ప్రయాణికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. భారతీయ రైల్వే అద్భుతంగా పనిచేస్తుందని ఆయన కితాబిచ్చారు. రైల్వే బడ్జెట్‌లో సురేశ్‌ ప్రభు దార్శనికత, సృజన శీలత కన్పించాయి. భవిష్యత్తు పట్ల ఆశావహదృక్పథం ఏర్పడిందని  జగత్‌ ప్రకాశ్‌ నడ్డా అన్నారు. రైల్వేలు భారత ఆర్థికవ్యవస్థకు వెన్నెముక అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ చక్కటి సమన్వయంతో కూడిన రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టారని  జయంత్‌ సిన్హా అన్నారు. బడ్జెట్‌ బాగుందని,  ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాలకు బడ్జెట్‌లో తగినంత ప్రాధాన్యతనివ్వడం సంతోషాన్ని కలిగించింది. రైల్వేల్లో కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయని¬ంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు అభిప్రాయపడ్డారు. నేను ఈ రైల్వే బడ్జెట్‌కి 10కి 9 మార్కులు ఇస్తా. చాలా మంచి రైల్వే బడ్జెట్‌  అంటూ  కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వ్యాఖ్యానించారు.  రైల్వే బడ్జెట్‌ ఆసాంతం అద్భుతంగా ఉంది. దేశ ఆర్థిక ప్రగతికి ఉపయోగపడేలా ఉందని  భాజపా అధికార ప్రతినిధి విూనాక్షీలేఖి వ్యాఖ్యానించారు. రైల్వే బడ్జెట్‌ అద్భుతంగా ఉందని,టికెట్‌ ధరలు పెంచకుండా అన్ని వ్యవస్థలనూ గాడిలో పెట్టారు. లోపాలను దిద్దుకుంటూ ముందుకు సాగే ధోరణి కన్పించిందదని బిజెపి నేత  కిరణ్‌బేడీ అభిప్రాయపడ్డారు.

పాత్రికేయులకు ఈ-బుకింగ్‌ సదుపాయం

పాత్రికేయులు ఆన్‌లైన్‌లోనూ టికెట్లు బుక్‌ చేసుకునే సౌకర్యాన్ని కేంద్రరైల్వే బడ్జెట్‌లో రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు కల్పించారు. 2016 రైల్వే బడ్జెట్‌ నుంచి కొత్తగా ఈ సదుపాయాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆన్‌లైన్‌లో తమకు ఈ సదుపాయాన్ని కల్పించాలని పాత్రికేయులు ఎప్పటి నుంచి కోరుతున్నారని దాన్ని తాము ఇప్పుడు నెరవేరుస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు రాయితీ పాస్‌లు పొందాలంటే పాత్రికేయులు రైల్వే కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేదని ఈ కొత్త సదుపాయం అందుబాటులోకి రావడం ద్వారా ఇక ఆ అవసరం ఉండదని చెప్పారు. నేరుగా ఈ బుకింగ్‌ ద్వారానే ఈ పాస్‌లు పొందవచ్చునన్నారు. పాత్రికేయుఉల దేశంలో ఎక్కడికైనా ప్రయాణించాలంటే అక్రిడేషన్‌ ఉంటే 50శాతం రాయితీ కల్పిస్తున్నారు.

ప్రయాణికలుకు బీమాతో భద్రతకు పెద్దపీట

రైలు ప్రయాణీకులకు బీమా సౌకర్యం కల్పించనున్నట్టు కేంద్ర రైల్వేశాఖమంత్రి సురేశ్‌ప్రభు తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. దీనిపై బీమా కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఈ సౌకర్యానికి టికెట్‌ ధరతో పాటు అదనంగా కొంత చెల్లించాల్సి వుంటుంది. అయితే బీమా తీసుకోవాలా వద్దా అన్నది ప్రయాణీకుల ఐచ్ఛికంపై ఆధారపడివుంటుంది. అయితే ప్రమాదాల సమయంలో ఇది ఎంతగానో అవసర అవుతుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇకపోతే దేశ ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌ ఉంటుందన్న కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు రైల్వే బడ్జెట్‌ ద్వారా తన వ్యాఖ్యలకు వాస్తవరూపం ఇచ్చారు. రైల్వేబడ్జెట్‌లో ప్రయాణికుడికి సౌకర్యాలు కల్పించే విషయంలో పెద్ద పీట వేశారు. బుకింగ్‌ సమస్యలు, ఆహారం, రక్షణ, వసతులు, శుభ్రత సహా పలు అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. రైలులో ప్రయాణించాలనుకునే వారికి ప్రధాన సమస్య బుకింగ్‌. కౌంటర్ల వద్ద గంటల తరబడి నిరీక్షణ, తత్కాల్‌ కోసం పాట్లు ఇవన్నీ నిత్యం జీవన సత్యాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుకింగ్‌ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు బడ్జెట్‌లో వెల్లడించారు.  తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం టికెట్లు జారీ చేసేందుకు ప్రత్యేక చర్యలు. అంటే రైల్వేస్టేషన్లో ప్రస్తుతం ఉన్న టికెట్‌ కౌంటర్లకు అదనంగా చిన్న చిన్న కౌంటర్ల ఏర్పాటు.

ప్లాట్‌ఫాం టికెట్ల జారీ కోసం ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో కేవలం డబ్బు మాత్రమే చెల్లించి టికెట్లు కొనాల్సిన అవసరం లేదు. క్రెడిట్‌/డెబిట్‌ కార్డులను సైతం ఆమోదించేలా చర్యలు.

వచ్చే మూడు నెలల్లో విదేశీయులు, ప్రవాసుల కోసం ఈ-టికెటింగ్‌ ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకునే వెసులుబాటు.  రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు ఒకవేళ ఆ టికెట్‌ను రద్దు చేసుకోవాలనుకుంటే ప్రహసనంగా ఉండే పక్రియ ఇక సులభతరం కానుంది. 139 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేసి టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకోవచ్చు.  ప్రధాన రైల్వేస్టేషన్లలో బార్‌ కోడ్‌ టికెట్లు, స్కానర్లును తీసుకురావటం ద్వారా ఇబ్బందులు లేని ప్రయాణాన్ని కల్పించాలని సంకల్పించారు.  తత్కాల్‌ టికెట్ల జారీలో మరింత పారదర్శకంగా, సమర్థంగా సేవలు అందించేందుకు చర్యలు. ఇందుకోసం ఆయా కౌంటర్ల వద్ద సీసీటీవీల ఏర్పాటు

రైల్వే బడ్జెట్‌ ముఖ్యాంశాలు….

ఈ ఏడాది రైల్వే ప్రణాళికా వ్యయం 1.21లక్షల కోట్లు

2016-17 ఆదాయ లక్ష్యం 1.87 లక్షల కోట్ల లక్ష్యం

2020 నాటికి 4వేల కోట్ల ఆదాయం సాధించే లక్ష్యం

2016-17 నాటికి 9వేల ఉద్యోగాలకు కల్పన

వచ్చే ఏడాది 2,800 కి.విూ. మేర కొత్త లైన్ల నిర్మాణం

వచ్చే ఏడాది 50 శాతం రైల్వేలైన్లు విద్యుద్దీకరణ

జపాన్‌ సాయంతో ముంబై- అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ ట్రైన్‌

పార్సిల్‌ బిజినెస్‌ను మరింత సరళీకరణ

ఆన్‌లైన్‌లో కూడా బుకింగ్‌ చేసుకునే వీలు

పుణ్యక్షేత్రాల రైల్వే స్టేషన్లు మరింత ఆధునీకరణ

టిక్కెట్‌ బుకింగ్‌ సమయంలో ఇన్సూరెన్స్‌ వర్తింపు

408 స్టేషన్లలో ఈ-కేటరింగ్‌

కోల్‌కతాలో 100 కిలోవిూటర్ల మేర మెట్రో పనులు

సీనియర్‌ సిటిజన్‌ కోటా 50 శాతం పెంపు

రైళ్లలో 30వేల బయో టాయిలెట్స్‌

ఇక నుంచి ఆన్‌ లైన్లోనే రైల్వే నియామకాలు

జర్నలిస్టులకు ఆన్‌లైన్‌లోనే రాయితీ

ఫారెన్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో ఈ-టికెట్‌ కొనుగోలు సౌకర్యం

వడోదరలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు

139 సర్వీసుతో రైలు టికెట్లను రద్దు చేసుకునే అవకాశం

కొత్తగా మూడు రకాల రైలు సర్వీసులు

కొత్తగా హమ్‌ సఫర్‌, తేజస్‌, ఓవర్‌ నైట్‌ డబుల్‌ డెక్కర్‌ ఉదయ్‌ ఎక్స్‌ ప్రెస్‌లు

2020 నాటికి గూడ్స్‌ రైళ్లకు టైంటేబుల్‌

అన్ని రైల్వేస్టేషన్లలో సీసీ టీవీల ఏర్పాటు

టైమ్‌ టేబుల్‌ ద్వారా రైళ్లను నడిపేందుకు ప్రాధాన్యత

రాజధాని, శతాబ్ధి రైళ్ల ఫ్రీకెన్సీ పెంపు

ఖరగ్‌ పూర్‌-ముంబై, ఖరగ్‌ పూర్‌-విజయవాడ మధ్య ట్రిప్లింగ్‌

రైల్వేల్లో ఐటీ వినియోగానికి ప్రాధాన్యం