మోదీకి పాక్ ప్రధాని ఫోన్
– పూర్తిగా సహకరిస్తాం
– నవాబ్
న్యూఢిల్లీ,జనవరి 5(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీతో మంగళవారం సాయంత్రం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఫోన్ లో మాట్లాడారు. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి కేసు దర్యాప్తులో సహకరిస్తామని మోదీకి చెప్పారు. పఠాన్ కోట్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో మోదీకి నవాజ్ షరీఫ్ ఫోన్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పఠాన్ కోట్ దాడితో రెండు దేశాల మధ్య చర్చల పునరుద్ధరణపై సందిగ్ధం నెలకొంది. శనివారం తెల్లవారుజామున పంజాబ్ లోని వైమానిక స్థావరంలోకి చొరబడిన ఆరుగురు ఉగ్రవాదులను 80 గంటల పాటు సాగిన ఆపరేషన్ లో సైనిక బలగాలు హతమార్చాయి. ఏడుగురు సైనికులు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు.