మోదీకి భయపడి.. టీఆర్‌ఎస్‌ ముందస్తుకు వెళ్లింది

– డిసెంబర్‌7న ప్రజాతీర్పు బీజేపీకి అనుకూలంగా ఉంటుంది
– కేంద్ర మంత్రి జేపీ నడ్డా
హైదరాబాద్‌, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో టీఆర్‌ఎస్‌ అధినేత, అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సరైన కారణం చెప్పడం లేదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీకి భయపడి టీఆర్‌ఎస్‌ ముందస్తుకు వెళ్తోందన్నారు. డిసెంబర్‌ 7న ప్రజాతీర్పు బీజేపీకి అనుకూలంగా రాబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని సీట్లు అనేది ముఖ్యం కాదని, మెజారిటీ స్థానాలు దక్కించుకోవడమే తమ వ్యూహమని జేపీ నడ్డా అన్నారు. రైతు మరణాలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ దగ్గర సమాధానం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ రాజకీయ స్వలాభం కోసం.. తెలంగాణ ప్రజలకు మోదీ పథకాలు చేరకుండా చేస్తున్నారని జేపీ నడ్డా తీవ్రస్థాయిలో విమర్శించారు. వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ కి సపోర్ట్‌ చేసిన కేసీఆర్‌ ఎందుకు ముందస్తుకు వెళ్లారని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హావిూలు నెరవేర్చలేదని ఆరోపించారు. కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలోనే రైతు ఆత్మహత్యలు చేసుకున్నారన విమర్శించారు.  ప్రజలు కేసీఆర్‌ కు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఆయుస్మాన్‌ భారత్‌ లో తెలంగాణ చేరలేదని తెలిపారు. రాజకీయ కారణాలతోనే ఆయుస్మాన్‌ భారత్‌ లో చేరలేదని విమర్శించారు. మోడీకి పేరు వస్తుందని కేసీఆర్‌ భయపడ్డారని అన్నారు.  తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీజేపీ నెరవేరుస్తోందని నడ్డా హావిూ ఇచ్చారు.