మోదీపై పోరుకు కలిసివస్తాం


` లౌకికవాదాన్ని కాపాడుకుందాం
` కేసీఆర్‌కు మద్ధతు ప్రకటించిన దేవేగౌడ
` మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు సీఎంకు అభినందన
హైదరాబాద్‌,ఫిబ్రవరి 15(జనంసాక్షి): కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాజీ ప్రధాని, జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు హెచ్‌.డి.దేవెగౌడ మద్దతు ప్రకటించారు. మంగళవారం సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేసిన దేవెగౌడ.. కేసీఆర్‌ పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు కేసీఆర్‌ను అభినందించారు. మతతత్వ శక్తుల విూద ఎవరైనా పోరాటాన్ని కొనసాగించాల్సిందేనని అన్నారు. దేశ లౌకికవాద సంస్కృతి, దేశాన్ని కాపాడుకునేందుకు అందరం అండగా ఉంటామని.. యుద్ధాన్ని కొనసాగించాలని కేసీఆర్‌కు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే తాను బెంగళూరుకు వచ్చి సమావేశమవుతానని ఈ సందర్భంగా దేవెగౌడకు సీఎం కేసీఆర్‌ తెలిపినట్లు సమాచారం.ఇదిలాఉంటే, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇప్పటికే పలువురు విపక్ష సీఎంలతో సంప్రదింపులు మొదలు పెట్టారు. ఇందుకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి మద్దతు లభిస్తోంది. మరోవైపు భాజపా, కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయ కూటమిపై ప్రయత్నాలు చేస్తోన్న పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌లతో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. దేశ సమాఖ్య స్వరూపం విచ్ఛిన్నం కాకుండా తామంతా కలిసి ప్రయత్నాలు చేస్తామన్నారు. ఇదే సమయంలో త్వరలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసే అవకాశాలున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవలే వెల్లడిరచారు. ఇలా కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేసేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధమవుతోన్న తరుణంలో మాజీ ప్రధాని దేవెగౌడ.. కేసీఆర్‌కు మద్దతు తెలపడం కీలక పరిణామంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

తాజావార్తలు