మోదీపై విరుచుకుపడిన కేజ్రీవాల్‌

kkkkఆమ్‌ ఆద్మీ పార్టీకి అనుకోని చిక్కువచ్చిపడింది. ఆ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ప్రమాదం పొంచి ఉంది. ఢిల్లీ ప్రభుత్వంలో 7 మందికే మంత్రులుగా అవకాశం ఉండటంతో మరో 21 మంది ఎమ్మెల్యేలను కేజ్రీవాల్‌.. పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించారు. వీరికి మంత్రులకు ఇచ్చే విధంగా కారు, కార్యాలయం వంటి వసతులు కల్పించింది. ఐతే ఇది చట్టవిరుద్ధమని.. దీన్ని లాభదాయక పదవులుగా భావించాలని రాష్ట్రీయ ముక్తి మోర్చా అనే స్వచ్ఛంద సంస్థ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ కార్యదర్శుల పదవిని లాభదాయక పదవుల జాబితా నుంచి తొలిగించాలని కేజ్రీవాల్ సర్కార్ రాష్ట్రపతిని కోరింది. దీనికి రాష్ట్రపతి నో చెప్పారు. దీంతో రాజ్యాంగ విరుద్ధంగా లాభదాయక పదవుల్లో ఉన్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయనవచ్చని తెలుస్తోంది. అటు ఇదంతా ప్రధాని మోడీ కావాలనే చేస్తున్నారని కేజ్రీవాల్‌ మండిపడ్డారు. పార్లమెంట్‌ లో బీజేపీకీ కాంగ్రెస్ అడ్డుతగులుతున్నట్లే తమకు మోడీ అడ్డుతగులుతున్నాడని విమర్శించారు. బీజేపీ మాత్రం కేజ్రీవాల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.