మోదీ చైనా పర్యటనలో హైదరాబాద్‌పై ఒప్పందం

5

స్నేహపూర్వక వ్యాపార నగరాల్లో మన రాజధాని

బీజింగ్‌, మే15 (జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనలో హైదరాబాద్‌ నగరానికి కూడా ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ చైనా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య 24 ఒప్పందాలు జరిగాయి. వాటిలో హైదరాబాద్‌ నగరం కూడా ఉండటం విశేషం.  భారత్‌లోని నాలుగు నగరాలతో  చైనాలోని నాలుగు నగరాలను అనుసంధానం చేస్తూ

ఈ నగరాల  మధ్య  పరస్పర  స్నేహపూర్వక  వ్యాపారం నిర్వహించేందుకు  ఒప్పందం కూడా ఉంది. ఇందులో భాగంగా  హైదరాబాద్‌ నగరాన్ని  చైనాలోని కింగ్‌దావ్‌

నగరంతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ఈ రెండు నగరాల మధ్య స్నేహపూర్వక వర్తకం జరిగే అవకాశం ఏర్పడింది. ఈ విధంగా హైదరాబాద్‌కు మేలు జరిగిందని

భావిస్తున్నారు.