మోదీ విదేశి పర్యటన ఖర్చు రూ.37.22 కోట్లు

4

సామాన్యుడు ధర్మసందేహం

సమాచార హక్కు చట్టం క్రింద వివరాలు

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తరచుగా విదేశీ పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు కూడా పలు విమర్శలు చేస్తున్నాయి. మరి మోడీ చేస్తున్న విదేశీ పర్యటనలకు ఖర్చు ఎంతవుతుంది ? ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ? అనే ఆలోచనలు అందరిలో కలుగక మానదు. ఓ వ్యక్తికి కూడా ఇలాగే సందేహాలు వచ్చాయి. దీనితో సమాచార హక్కు చట్టాన్ని వినియోగించాడు. 2014 జూన్‌ నుండి ఈ ఏడాది జూన్‌ మధ్య కాలంలో మోడీ చేసిన విదేశీ పర్యటనల మొత్తం ఖర్చులను తెలుపమన్నాడు. అక్షరాల రూ.37 కోట్లు ఖర్చయిందని తేలింది. అగ్రభాగం ఆస్ట్రేలియా పర్యటనకు ఖర్చు పెట్టారని పేర్కొంది. ఏడాది కాలంలో మోడీ మొత్తం 20 దేశాల్లో పర్యటించారని, మొత్తం రూ.37.22 కోట్లు ఖర్చయిందని పేర్కొంది. వీటిలో అత్యధికంగా ఆస్ట్రేలియా, యూఎస్‌, జర్మనీ, ఫిజీ, చైనా దేశాలకు కాగా భూటాన్‌ పర్యటనకు మాత్రం రూ.41.33 లక్షలు తక్కువగా ఖర్చయ్యాయని వివరించారు. ¬టల్‌ లో బస ఖర్చు రూ.5.60 కోట్లు అని, అద్దె కార్లకు రూ.2.40 కోట్లు అని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. అదండి సంగతి..