మోపిదేవి స్వామికి విలువైన కానుక
విజయవాడ, జూలై 29 : మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఒక భక్తుడు ఆదివారంనాడు లక్ష రూపాయల విలువ చేసే వెండి ఆభరణాలను కానుకగా ఇచ్చాడు. అయితే తన వివరాలను వెల్లడించడానికి అతను ఇష్టపడలేదు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి మొక్కుకున్నాకే తన జీవితం మలుపులు తిరిగిందని, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరానని ఆయన చెప్పారు. ఆ భక్తితో తనకు తోచినంత స్వామివారికి కానుక ఇచ్చానని అతడు వెల్లడించాడు. ఉత్సవ సమయాల్లో ఈ ఆభరణాలను స్వామి వారికి ఆలంకరిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి లక్ష్మణరావు చెప్పారు.