మోసం కేసులో ముగ్గురికి జైలు

శ్రీకాకుళం, జూలై 29 : నకిలీ బంగారు బిస్కెట్‌లతో ప్రజలను మోసగిస్తున్న కేసులో గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన బండి పూడి శ్రీను, దుంపల వెంకటేష్‌, తెల్ల రమణమ్మలకు పాలకొండ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ యజ్ఞనారాయణ రెండేళ్ల పాటు జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల పాటు అదనంగా జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. బూర్జ మండలానికి చెందిన ఎం.పుణ్యవతి 2011, జనవరి నెలలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అరెస్టు చేశారు.