మోసపోతే గోస పడతాం

మోసపోతే గోస పడతాం

కేసముద్రం-జనం సాక్షి : సబ్బండ వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సాధించిన ప్రగతి దేశంలోనే అన్ని రాష్ట్రాలకు దిక్సూచిగా మారడం హర్షించదగ్గ విషయమని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నజీర్ అహ్మద్ అన్నారు.రాష్ట్ర ఖజాన బడ్జెట్ను బట్టి విడతలవారీగా గృహలక్ష్మి,దళిత బంధు,బీసీ బందు,మైనార్టీ బందు పథకాల అమలకు శ్రీకారం చుట్టారన్నారు.ప్రతి ఒక్కరికి ఆన్లైన్ చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు తప్పనిసరి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం సూచించడం జరిగింది. ప్రతిపక్షాల ప్రలోభాలు,అసత్య ప్రచారాలను నమ్మి ధర్నాలు,రాస్తారోకోలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.అన్ని వర్గాల ప్రజలకు గడప గడపకు సంక్షేమ పథకాన్ని అందచేసిన ద ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక వ్యవసాయానికి ఉచిత 24 గంటలు విద్యుత్, రైతులకు పండించిన పంటకు మద్దతు ధర,విద్య, వైద్యమే కాకుండా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని ఓర్చుకోలేక ప్రతిపక్ష పార్టీలు నానా యాగి చేస్తూ ప్రజలను పెడుతున్న తికమకలకు ప్రజలు నమ్మకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బి ఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీల మోసపూరిత మాటలకు,అసత్య ప్రచారాలకు మోసపోతే గోసపడతాం అని మండల పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ నజీర్ అహ్మద్,మండల ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్,ఎంపీపీ ఓలం చంద్రమోహన్,జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ నీలం సుహాసిని దుర్గేష్,వైస్ ఎంపీపీ రావుల నవీన్ రెడ్డి,పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి,మర్రి రంగారావు,డికొండ వెంకన్న,మాచర్ల రమేష్,మాదారపు సత్యనారాయణ రావు,సట్ల వెంకన్న,జిల్లా నాయకులు రావుల రవిచంద్ర రెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు వీరు నాయక్, పట్టణ ప్రధాన కార్యదర్శి తరాల వీరేష్ యాదవ్ అన్నారు.