మ్యాన్‌హోల్స్‌లో నో మాన్యువల్‌

C

– యంత్రాలే శుభ్రం చేస్తాయి

– చనిపోయిన కార్మికులకు 10 లక్షల పరిహారం

– చెత్త తరలింపునకు సరికొత్త యంత్రాలు

– ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,ఆగస్టు 16(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌లో పారిశుద్ద్యం కోసం ప్రత్యేక చర్యలకు ప్రబుత్వం నడుం బిగించింది. ఇటీవల నలుగురు పారిశుద్ద్య కార్మికుల చనిపోవడంతో మ్యాన్‌¬ల్స్‌ క్లీనింగ్‌ అంతా ఇక మెషిన్లతో జరపాలని నిర్ణయించింది.  స్వచ్ఛ హైదరాబాద్‌ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ 176 స్వచ్ఛ ఆటోలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.  ఇటీవలే మ్యాన్‌¬ల్‌ పడి నలుగురు కార్మికులు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల నష్ట పరిహారం ఇస్తామని, వారికుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కారి/-మకలు మృతి ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ  ఇదే చివరి ఘటన కావాలన్నారు. రాబోయే కాలంలో మ్యాన్‌¬ల్‌లను యంత్రాలతో శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ కార్మికులకు బూట్లు, గ్లౌస్‌లు, మాస్క్‌లు సమకూర్చుతామని పేర్కొన్నారు. చెత్త తరలింపు కోసం ఆధునిక టెక్నాలజీతో వాహనాలను ప్రత్యేకంగా తయారు చేశారు. రోడ్లను శుభ్రం చేసే వాహనాన్ని మంత్రి స్వయంగా నడిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మంత్రి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్ధీన్‌, తో పాటు పలువురు నేతలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.హైదరాబాద్‌ నగరాన్ని అద్భుతంగా తయారు చేస్తామని చెప్పారు. చెత్త తరలింపు కోసం ఆధునిక టెక్నాలజీతో ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాలు ఉపయోగిస్తున్నామని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో పాత వాహనాలను దశల వారీగా తొలగిస్తామని ప్రకటించారు. ఇప్పటికే 1824 ఆటోలను పంపిణీ చేశాం, ఇవాళ 176 ఆటోలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.  నగరంలో పూర్తిస్థాయి పారిశుద్ధ్యం నెలకొల్పేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మ్యాన్‌ ¬ల్‌లో పడి నలుగురి కార్మికులు మరణిచంటం దురదృష్టకరమన్నారు. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని, మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. బాధిత కటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఇకపై నగరంలో మ్యాన్‌¬ల్‌ క్లీనింగ్‌ యంత్రాలతో చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.