‘భారత్‌లో మహిళల పట్ల నిర్లక్ష్యం, అగౌరవం ఎక్కువయ్యాయి. అత్యాచారం, లైంగిక వేధింపులు, వివాహ బంధంలోనూ అత్యాచారాలు, ఆడపిల్లల బ్రూణహత్యలు చాలా పెరిగాయి. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఖగోళ శాస్త్రంలో దూసుకుపోతోంది, కానీ మహిళల పట్ల జరుగుతున్న హింస సిగ్గు చేటు’ అని ఓ వ్యక్తి వెల్లడించినట్లు సర్వే పేర్కొంది. ప్రభుత్వ డేటా ప్రకారం.. దేశంలో 2007 నుంచి 2016 మధ్య మహిళలపై జరిగిన నేరాలు 83శాతం పెరిగాయి. ప్రతి గంటకు నాలుగు కేసులు నమోదవుతున్నాయి.