యాకూబ్‌ మెమెన్‌కు క్షమాభిక్షపై విచారణ…

రేపటికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు

dwtz49fiన్యూఢిల్లీ, జూలై 27 : యాకూబ్‌ మెమెన్‌కు క్షమాభిక్షపై విచారణను సుప్రీం కోర్టు మంగళవారం నాటికి వాయిదా వేసింది. మెమెన్‌కు ఉరి శిక్ష విధించాల్సిందేనంటూ మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ముఖుల్‌ రోహత్గీ వాదనలు విపించారు. రేపు (మంగళవారం) పిటిషనర్‌ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. ముంబై పేలుళ్ల ఘటనకు కారకుడైన ఉగ్రవాది మెమెన్‌కు సుప్రీం కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ నెల 30న నాగ్‌పూర్‌ జైల్లో ఆయనకు ఉరి తీయనున్నారు. ఇందుకు మహారాష్ట్ర ప్రభత్వం ఏర్పాట్లు కూడా చేసింది. అయితే యాకూబ్‌ మెమెన్‌కు ప్రాణ భిక్ష పెట్టమని, ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని ఆతని భార్య సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగిన అనంతరం ఈ మేరకు న్యాయస్థానం వాయిదా వేసింది.