యాదమ్మకు స్ట్రీట్ వెండర్ అంబ్రెల్లా అందజేత
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 08(జనం సాక్షి)
లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వారియర్స్ అధ్వర్యంలో శనివారం వరంగల్ నగరంలోని అండర్ బ్రిడ్జి ప్రాంతానికి చెందిన టీ బండి నిర్వహిస్తున్న గడ్డం యాదమ్మ కి నిలువ నిడ లేనందున వీధి వ్యాపారులకు సౌకర్యం కొరకు వీధి విక్రేత గొడుగు వరంగల్ వారియర్స్ క్లబ్ అధ్యక్షులు మండల పరశురాములు అందజేసినారు. ఈ సందర్భంగా పరశురాములు మాట్లాడుచూ నిరుపేదలను ఆదుకునుటలో, లయన్స్ క్లబ్స్ ముందుంటాయని, నిరుపేదలు నిరుత్సాహ పడకుండా స్వయం ఉపాధి రంగాలలో రాణించాలని తెలిపారు, అలాగే నిరుపేదలు తమ పిల్లలనను బాలకార్మికులుగా మార్చకుండా తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ హాస్టల్ ద్వారా లబ్ది పొందాలని కోరారు, నేటి యువత స్వయం ఉపాధ్ది రంగాల పైన ద్రుష్టి పెట్టాలని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కొండ్రెడి నవీన్ రెడ్డి , కోశాధికారి నాసం ప్రవీణ్ , ఉపాధ్యక్షుడు కందికొండ కుమార స్వామి , డిస్ట్రిక్ట్ చైల్డ్ హుడ్ క్యాన్సర్ ప్రతినిది డా. ఆకారపు రాజగోపాల్, లయన్ మెంబెర్ మంతెన రాజేష్ తదితరులు పాల్గొన్నారు