యాదవులను గుర్తించి యాదవ బంద్ పథకం ఇవ్వాలి

యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు రాజు యాదవ్

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్1(జనంసాక్షి)

యాదవులను గుర్తించి ప్రతి యాదవ కులానికి 10 లక్షలు ఇవ్వాలని తెలంగాణ యాదవ మహ సభ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సూత్రపు రాజు యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొర్రెలు ఓట్ల కోసం గొర్రెలను ఇస్తున్నారు కానీ యాదవులు బ్రతకటానికి కాదని, గొర్రెలను మేపటానికి స్థలాలేలేక అటవిలో మేపటానికి వెళ్తే కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, యాదవులు ఇష్టం వచ్చిన చిన్నచిన్న వ్యాపారాలు చేసుకోవటంకోసం10 లక్షలు ఇచ్చి వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని రాజు డిమాండ్ చేశారు. యాదవులు ఏమి పాపం చేశారంటూ, దళితులకు దళిత బంద్ ఇస్తున్నట్టే యాదవ బంద్ ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు. యాదవులు18 ఏండ్లు దాటిన అందరికి 10 లక్షలు ఇవ్వాలని లేకుంటే యాదవులు ఎంత శాంతి కామకులో తిరగ బడితే దొడ్డి కోమరయ్య లాగ పోరాట స్ఫూర్తితో ఉద్యమిస్తామని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు నేతుల వెంకన్న యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు నర్సింగ అశోక్ యాదవ్, కురవి మండల అధ్యక్షుడు పోతుల దిలీప్ యాదవ్, బోల్లం వేణు యాదవ్, ముషేకర్, సాగర్ తదితరులు పాల్గొనడం జరిగింది.