యాసంగిలో వరి వేస్తే ఊరుకునేది లేదు
విత్తనాలు అమ్మితే డీలర్ల షాపులు మూయిస్తా
సుప్రీం కోర్టు ఆదేశించినా వినేది లేదు
డీలర్లు అధికారులకు కలెకట్ర్ వెంకట్రామి రెడ్డి వార్నింగ్
కలెక్టర్ తీరుపై మండిపడ్డ సిపి, కాంగ్రెస్ నేతలు
సిద్ధిపేట,అక్టోబర్26(జనంసాక్షి): యాసంగిలో వరివిత్తనాలు అమ్మవదందంటూ అగ్రికల్చర్ విూటింగ్‌లో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ యాసంగిలో వరి విత్తనాలు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఒకవేళ ఎవరైన వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే ఒక్కొక్కరిని చెండాడుతా, వేటాడుతా.. అంటూ హెచ్చరించారు. వరి విత్తనాలు అమ్మె హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, విత్తన సరఫరా చేసే డీలర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కోరుతోందని, కేంద్రం కూడా వడ్డు కొనబోమని అంటోందని అన్నారు. ఈ క్రమంలో ఆయన అధికారులతో సవిూక్షించారు. ఈ సందర్భంగా విత్తన డీలర్లను ఉద్దేశించి సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తాజాగా ఘాటైనా వ్యాఖ్యలు చేశారు. వరి సాగు చేస్తే ఊరుకునేది లేదని, రైతులకు వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. యాసంగిలో ఎవరైనా ఒక్క కేజీ వరి విత్తనాలు
విక్రయించినా ఊరుకునేది లేదని.. అమ్మితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. వ్యాపారం రద్దు చేసి షాపుని మూయిం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. డీలర్లు సుప్రీం కోర్టుకి వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా షాపు ఓపెన్ చేసేది లేదని తేల్చిచెప్పారు. నేను చెప్పిన దానికి విరుద్ధంగా సుప్రీం కోర్టు జడ్జి చెప్పినా, రాష్ట్ర హైకోర్టు జడ్జి చెప్పినా, ప్రజా ప్రతినిధులు చెప్పినా నేను కలెక్టర్‌గా ఉన్నంతకాలం ఎటువంటి పరిస్థితులలో షాపులు తెరుచుకోవు. ఒకవేళ డీలర్లు విత్తనాలు అమ్మితే సంబంధిత ఏఈవోలు, అధికారులు సస్పెండ్ అవుతారు.’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, సిపిఐలు తీవ్రంగా స్పందించాయి. కేసీఆర్ ప్రభుత్వం రైతుల మెడ చుట్టూ ఉరి తాడు బిగిస్తోందని సిపిఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. వరిసాగుపై జిల్లా కలెక్టర్ మాట్లాడిన పదాలను వెనక్కి తీసుకోవాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రైతులను చైతన్యం చేయాల్సింది పోయి మెచ్చరింపులు, బెదరింపులకు దిగడం దారుణమన్నారు. దీనిపై కలెక్టర్ తక్షణం వివరణ ఇవ్వాలన్నారు. ఇకపోతే పెరిగిన పెట్రో ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాట 60 శాతం ఉందని తెలిపారు. హుజురాబాద్ ఎన్నికలను గిన్నిస్ రికార్డు ఎక్కించాలని వ్యాఖ్యానించారు. సమాచార హక్కు చట్టంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని విమర్శించారు. యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండిరచాలని, ఎవరైనా ఒక్క కేజీ వరి విత్తనాలు విక్రయించినా ఆ దుకాణ దారులను జైలుకు పంపిస్తామని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తాను కలెక్టర్ గా ఉన్నంతకాలం సుప్రీంకోర్టు చెప్పినా ఆ విత్తన దుకాణాలు తెరుచుకోవని కలెక్టర్ పేర్కొనడంపై రేవంత్ మండిపడ్డారు. ఈ కలెక్టర్ ఏమైనా సుప్రీంకోర్టు కంటే పెద్దవాడ్ని అనుకుంటున్నాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ’వరి విత్తనాలు అమ్మితే షాపులు సీజ్ చేస్తామని సిద్ధిపేట కలెక్టర్ బెదిరిస్తున్న తీరు దారుణమన్నారు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా షాపులు తెరిచేందుకు ఒప్పుకోబోమని అంటున్నాడు. అధికారులను కూడా సస్పెండ్ చేస్తానని హెచ్చరిస్తున్నాడు. ఈ కలెక్టర్ సుప్రీంకోర్టును మించిన సుప్రీమా? తెలంగాణ సీఎం కార్యాలయం దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అంటూ రేవంత్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పరోక్షంగా రైతులను హెచ్చరించడమే అన్నారు. రైతులు పంటలు పండిరచవద్దనుకుంటే ప్రాజెక్టులు కట్టి పంటలు పెంచామని సర్కార్ ఎందుకు గొప్పలకు పోతోందని అన్నారు.