యాసంగిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.


– జిల్లా వ్యవసాయ అధికారిణి కల్పన.
నెన్నెల, మార్చ్ 27, (జనంసాక్షి )
యాసంగిలో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారిణి కల్పన అన్నారు. సోమవారం ఆమె మండలంలోని కోణంపేట గ్రామంలోని యాసంగి పంట క్షేత్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి భూసారాన్ని కాపాడాలని సూచించారు. రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూసారం దెబ్బతిని ఆశించిన దిగుబడి రాదని అన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా ఉన్న సంక్షేమ పథకాలను వివరించారు. రైతు బంధు, రైతు భీమా, పీఎం కిసాన్ వంటి పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట వ్యవసాయ విస్తరణ అధికారి రాంచందర్, రైతులు పాల్గొన్నారు