యుద్దం అన్నది ఉక్రెయిన్‌ స్వయంకృతమా

శుక్రవారం 4`3`2022
ఒకప్పుడు సోవియట్‌ యూనియన్‌లో భాగమైన ఉక్రెయిన్‌ ..ఎందుకనో రష్యాతో సంబంధాలు తెంచుకుని పుతిన్‌కు వ్యతిరేకంగా మారడంతో పాటు..అమెరికా ఉచ్చులో పడిన ఖర్మానికి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అమెరికా నాటో కూటమిలో చేర్పించే ప్రయత్నాలతో ఉక్రెయిన్‌ పక్కలో బల్లెంలా మారుతుందన్న ఆందోళనతో ఉన్న రష్యా ఇప్పుడు యుద్దానికి దిగక తప్పని పరిస్థితి ఏర్పడిరది. అయితే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్సీకి ముందుచూపు లేని కారణంగా ఇప్పుడు కోరి యుద్దాన్ని తెచ్చు కున్నారనే చెప్పాలి. రష్యాతో స్నేహసంబంధాలు కొనసాగించి..రష్యా కూటమిలో ఉండివుంటే ఇంతగా ఇప్పుడు దారుణ స్థితి వచ్చేది కాదని ఆ దేశ ప్రజలు కూడా భావిస్తున్నారు. నిజానికి ఉక్రెయిన్‌ పేరుతో ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఆర్థికలబ్ది పొందేందుకు అమెరికా పథకం వేసిందనే వాదన కూడా వుంది. ఉక్రెయిన్‌ కు అమెరికాతో జతకట్టాల్సిన పనిలేదు. వారి మూలాలన్నీ సోవియట్‌తోనే ఉన్నాయి. రష్యా కూడా వారికి అనుకూలంగానే ఉంది. కానీ జెలెన్స్‌కీ వచ్చిన తరవాతనే ఇప్పుడు రష్యాను ఎదరించే అలవాటు చేసుకు న్నారు. అదికూడా నాటో దేశాల కారణంగానే అని చెప్పుకోవాలి. నిజానికి రష్యాతో సన్నిహితంగా ఉంటూ ఇంతకాలం ఉమ్మడి ఆస్తుల విషయంలో అంగీకారయోగ్యంగా ఉంటూ వచ్చిన ఉక్రెయిన్‌ను నాటోదేశాలు, అమెరికా ఓ రకంగా రష్యాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాయనే చెప్పాలి. ఇదే ఇప్పుడు ఉక్రెయిన్‌ను సర్వ నాశనం చేస్తోంది. రష్యా చేసిన నష్టాన్ని రష్యానే భరిస్తుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఇప్పడు చెబుతున్నా జరగాల్సిన నష్టం జరిగింది. ఆర్థిక విధ్వంసం జరిగింది. ఆస్తుల విధ్వంసం జరిగింది. ఎందరో ప్రాణాలు చేతబట్టి పారిపోయారు. మరెందరో మృత్యువాతపడ్డారు. ఇవన్నీ పూడ్చుకోవడం సాధ్యామేనా అన్నది ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఆలోచించలేదు. రష్యాకూడా వెన్క్కి తగగ్గకుండా అంతు చూస్తామన్న రీతిలో ముందుకు సాగుతోంది. దీంతో రష్యాకుకూడా నష్టం జరగవచ్చు. సైనికులను కోల్పోవచ్చు. విమానాలను కోల్పోవచ్చు. కానీ పట్టువీడడంమాత్రం కానరావడం లేదు. ఎక్కడో ఒక చోట ఉద్రిక్తతలు, యుద్ధం ఉంటేనే అమెరికా తదితరదేశాల ఆయుధాల డీలర్లకు కలసి వస్తుంది. తమ ఉత్పత్తులు అమ్ముకొని లబ్ది పొందవచ్చ న్నది వారి ఎత్తుగడగా ఉంటుంది. ఐరోపాకు ముప్పును ఎదుర్కొనే పేరుతో ఏర్పాటు చేసిన నాటో ద్వారా జరుగుతున్న కుతంత్రాలకు ఇదే ఆజ్యం పోస్తున్నది. గత కొద్ది నెలలుగా తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా అనేక దేశాల నుంచి పెట్టుబడులు అమెరికా ద్రవ్య మార్కెట్‌కు తరలుతున్నాయి. అమెరికా విదేశాంగ విధానాన్ని ఆయుధ కంపెనీలు నిర్దేశిస్తున్నాయి. ఉక్రెయిన్‌`రష్యా వివాదం కొత్త మలుపు తిరిగడంలోనూ ఈ ఆయుధ బేహారుల పాత్ర లేకపోలేదు. ఉక్రెయిన్లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న డాన్‌టెస్క్‌, లుహాన్స్క్‌ రిపబ్లిక్కులను గుర్తిస్తున్నట్లు ఇప్పటికే రష్యా ప్రకటించింది. వెంటనే ఆ రిపబ్లిక్కులతో ఎలాంటి లావాదేవీలు జరపవద్దంటూ ఆర్థిక ఆంక్షలను అమెరికా అధినేత జోబైడెన్‌ ప్రకటించటంతో మరో రూపంలో వాటిని గుర్తించినట్లయింది. పశ్చిమ దేశాలన్నీ రష్యా చర్యను ఖండిరచగా మన దేశం తటస్ధ వైఖరి తీసుకొని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరింది. తాజా పరిణామాలపై భద్రతా మండలి ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అన్న నమ్మకం కూడా లేదు. తాను గుర్తించిన రిపబ్లిక్కులతో స్నేహ ఒప్పందాలు చేసు కున్న రష్యా ఆ ప్రాంతాలకు శాంతి పరిరక్షక దళాలను పంపనున్నట్లు వార్తలు వచ్చాయి. ఎందుకంటే అవి ఎప్పటినుంచే రష్యాలో భాగం కావాలని చూస్తున్నాయి. డాన్‌టెస్క్‌, లుహాన్స్క్‌ రిపబ్లిక్కులను గుర్తించటం ద్వారా ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లయిందని, ఇది దాడేనని అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు గుండెలు బాదుకుంటున్నాయి. ఈ రెండు ప్రాంతాలూ 2014 లోనే ఉక్రెయిన్‌ నుంచి విడిపోవాలని
నిర్ణయించుకున్నాయి. అందుకోసం అక్కడి జనం ఆయుధాలు పట్టారు. వారిని అణచివేసేందుకు ఉక్రెయిన్‌ పంపిన భద్రతా దళాలను తిప్పికొట్టి రిపబ్లిక్కులుగా ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రెండు స్వతంత్ర రిపబ్లిక్కుల లోని ఉక్రెయిన్‌ దళాలను ఎదుర్కొనేందుకు రష్యా సైనిక దళాలను పంపింది. అదే సమయంలో ఉక్రెయిన్‌ మూడు వైపుల నుంచి తన దళాలను మోహరించి దాడులు చేసేందుకు రష్యా సన్నద్ధమైంది. మొత్తంగా గత వారం రోజులుగా జరుగుతున్న దాడుల వల్ల ఉక్రెయిన్‌ భారీగా నష్టపోయింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడం అంత సులభం కాదు. ఓరకంగా చెప్పాలంటే నాటో కూటమిలోని యుద్ధోన్మాద దేశాలు ముఖ్యంగా అమెరికా, బ్రిటన్‌ సృష్టించిన ఉక్రెయిన్‌`రష్యా వివాద ప్రతికూల పర్యవసానాలు అనేక దేశాలను కలవర పెడుతున్నాయి. వాటిలో మన దేశం ఉంది. ఐదు రాష్టాల్ర ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే ఈ వివాదం తలెత్తింది. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని భద్రతా మండలిలో మన దేశం సరైన వైఖరినే వెల్లడిరచింది. ఈ యుద్దం వల్ల ముడిచమరు ధరలు పెరుగుతాయి.ఆర్థిక విశ్లేషకుల అంచనా ప్రకారం ఇది ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు, రూపాయి విలువ పతనానికి దారితీస్తుంది. రష్యా, ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు కొనసాగు తూనే ఉంటే సహజవాయు, నిత్యావసర వస్తువులు, లోహాలు, ఇతర వస్తువుల ధరలు మన దేశంలో కూడా పెరుగుతాయని చెబుతున్నారు. ఇదే క్రమంలో ఉక్రెయిన్‌కు ఆయుధ సంపత్తిని అందచేస్తామని అమెరికా తదితర దేశాలు ప్రకటించాయి. దీంతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు మరింత పట్టుదలతో పోరాడాలని చూస్తున్నారు. ఇలా ఎన్నిరోజులు పోరాడగలరు. పరిస్థితి చూస్తుంటే మరో రెండు రోజుల్లో రష్యా దళాలు ఉక్రెయిన్‌ను పూర్తిగా ఆక్రమించుకోవచ్చు. అదేజరిగితే నాటోదేవృాలుపలయానం చిత్తగించక తప్పదు. ఈ క్రమంలో దేశాన్ని సర్వనాశనం చేసుకున్ననేతగా జెలెన్‌స్కీ మిగిలిపోతారు. విదేశీ విద్యార్థులకు అండగా ఉన్నుక్రెయిన్‌ ఆర్థికంగా ఎంతగానో సంపాదిస్తోంది. ప్రధానంగా మెడికల్‌ విద్యతతో అనేక దేశాలు ఉక్రెయిన్‌లో విద్యాను అభ్యసిస్తున్నారు. ఇప్పుడా అవకాశం పోయినట్లుగానే భావించాలి.