యుద్ద ప్రభావంతో ఆయల్ రేట్లు పైపైకి
టిఫిన్ సెంటర్లలో పెరిగిన పూరీ రేట్లు
హోటళ్లు మొదలు, రోడ్‌సైట్ బండ్లపైనా ధరల ప్రభావం
విజయవాడ,మార్చి9(జనం సాక్షి): రష్యా`ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించకపోవడంతో వంటనూనె ధరలు పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. నేడోరేపో పెట్రో ధరలూ భారీగా పెరగనున్నాయి. ఈ కారణంతో నిత్యావసరాల ధరలూ ఆకాశాన్నంటి సామాన్యుడికి చుక్కలు చూపించనున్నాయి. ఈ క్రమంలో మరోమారు రోడ్‌సైడ్ టిఫిన్ ధరలు కూడా పెరిగగాయి. ఇడ్లీ,దోసె, పూరీల ధరలకు రెక్కలు వచ్చాయి.
హోటళ్లు, రెస్టారెంట్లు ఆయిల్‌తో తయారుచేసే ఆహార పదార్థాల తయారీ నిలిపివేయగా, మరికొన్ని రేట్లు పెంచేశాయి. నగరాల నుంచి గ్రామాల వరకు అనేక హోటళ్ల నుంచి రోడ్డుపై బండి వరకు నూనెధరల సాకుతో టిఫిన్ రేట్లు పెంచేశారు. దోసె, పూరీపై పది నుంచి పన్నెండు చొప్పున, ఇడ్లీపై అయిదు రూపాయల చొప్పున ధర పెంచేశాయి. నూనె ధరలు పెరగడంతో పెంపు తప్పలేదని బయట బోర్డులు ఏర్పాటు చేశాయి. ప్రముఖ హోటళ్లలోను అల్పాహార ధరలు పెరిగిపోయాయి. తోపుడు బండ్లు, చిన్నచిన్న కాకాహోటళ్ల వరకు టిఫిన్ రేట్లు పెంచినట్లు బోర్డులు ఏర్పాటుచేశాయి. గ్రామాల్లోను దోసె, పూరీ రేట్లు పెరిగాయి. కొన్ని హోటళ్లయితే ధరలు పెంచడానికి బదులు పూరీ విక్రయాలు నిలిపివేశాయి. కొన్నిచోట్ల
నూనె ధరల కారణంగగా పూరీ అమ్మకాలు నిలిపి వేసారు. దోసెలు కూడా తగ్గించేసింది. కొన్ని రెస్టారెంట్లు చికెన్ స్టార్టర్ల రేట్లు కూడా పెంచి మెనూ ధరలు సవరించాయి. మొత్తంగాయుద్ధం ప్రభావం సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. దాని ప్రభావంతో విధించిన ఆంక్షల కారణంగా చమురు ఉత్పత్తి ధరలు అమాంతం పెరిగిపోవ డంతో నూనె ధరలకు గడచిన పన్నెండు రోజులుగా రెక్కలు వచ్చాయి. సామాన్యుడు దుకాణానికి వెళ్లి నూనె కొనాలంటే ధర చూసి కళ్లు తేలేస్తున్నాడు. పెరిగిన రేట్లతో ఆందోళనచెందాల్సిన పరిస్తితి ఏర్పడిరది. దీంతో నూనె విక్రయాలు పడిపోయాయి. అటు తప్పనిసరి గా హోటళ్లు, రెస్టారెంట్లు భారీ ధరలకు వీటిని కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే అవకాశంగా కొందరు నూనె వ్యాపారులు ఏకంగా యుద్ధం పేరు చెప్పి అమాంతం రేట్లు పెంచి విక్రయిస్తున్నారు. పన్నెండు రోజుల కిందట వరకు వంట నూనె ధర లు తక్కువగానే ఉండేవి. సన్‌ప్లవర్, ఫ్రీడమ్, ఇతర బ్రాండ్లు కిలో రూ.130 నుంచి రూ.138 వరకు విక్రయించేవి. అయిదు లీటర్ల డబ్బాలు రూ.700 నుంచి రూ.720 వరకు, 15 లీటర్లు రూ.1990 నుంచి రూ.2,200 వరకు అమ్మేవి. అయితే రష్యా` ఉక్రెయిన్ యుద్ధం మొదలవడంతో చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి బ్యారెల్ ధర ము నుపెన్నడూ లేనంత భారీగా పెరిగిపోయింది. రష్యా నుంచి ఎగుమతులపై విదేశాలు ఆంక్షలు విధించడంతో ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. దీంతో వంటనూనెల ధరలు అమాంతం ఆకాశాన్నంటాయి. దీంతో జిల్లాలో ధరలు భారీగా పెరిగాయి. మొన్నటివరకు కిలో రూ.138 వరకు ఉన్న ప్రముఖ సన్‌ప్లవర్ బ్రాండ్ నూనె ఇప్పుడు రూ.175, అయిదు లీటర్లు రూ.890, 15 లీటర్ల డబ్బా రూ.2,7820 వరకు పెరిగిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే గడచిన పన్నెండు రోజుల్లో వంట నూనెలపై కిలోకు రూ.37, అయిదు కేజీలపై రూ.170, 15 లీటర్లపై రూ.520 భారం పడిరది. దీంతో వీటిని కొనలేక సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ధరలు తగ్గేవరకు కొందరు వినియోగం సైతం తగ్గించుకుంటున్నారు. ఇప్పుడూ అయిదు లేదా పదిహేను లీటర్లు కొనే కుటుంబాలు కూడా ఇప్పుడు ధరల భగ్గుతో కిలో ప్యాకెట్‌తో సరిపెట్టుకుంటున్నాయి. ఇదంతా ఒకెత్తయితే వంట నూనెల ధరలు ఇంకా పెరిగిపోతాయయనే భయంతో కొందరు ఎక్కువగా నూనె డబ్బాలు కొంటున్నారు. ఇదే అదనుగా పలువురు వ్యాపారులు బ్లాక్‌లో అమ్ముతున్నారు. దీనిపై ఫిర్యాదులు భారీగా వస్తుండడంతో గడచిన నాలుగు రోజులుగా జిల్లాలో అనేకచోట్ల ఆయిల్ వ్యాపా రాలపై విజిలెన్స్ అధికారులు దాడులు జరుపుతున్నారు. అటు యుద్ధం ప్రభావంతో నేడో, రేపో పెట్రో ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు రవాణా ఖర్చుల భారం పేరుతో నిత్యావసరాలు, పండ్ల ధరలు కూడా మరింత పెరిగి సామాన్యుడి నడ్డి విరగ్గొట్టనున్నాయి.