యుమున మళ్లీ ఉగ్రరూపం
` ఉత్తరాదిలో మళ్లీ వరదబీభత్సం
` వరదముప్పుతో ఢల్లీి వాసుల ఆందోళన
` ఉత్తరాఖండ్, హిమాచల్‌లో మళ్లీ కుంభవృష్టి..
` గుజరాత్‌లో భారీ వర్షాలు.. వరదనీటిలో తేలియాడిన కార్లు..!
` జమ్మూకశ్మీర్‌లో ఇల్లు కూలి ఐదుగురు, కొండచరియలు విరిగిపడి ముగ్గురి మృతి
న్యూఢల్లీి(జనంసాక్షి): వరద ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఉత్తరాదిని మళ్లీ భారీ వర్షాలు వణికిస్తున్నాయి. హిమాచల్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్టాల్ల్రో రెయిన్ అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక పోటెత్తిన వరదతో ప్రమాదస్ధాయిని మించి ప్రవహించిన యమునా నదిలో నీటి ప్రవాహం ఇటీవల కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే తాజా వరదలతో మరోమారు యమునానది పోటెత్తింది. పొరుగు రాష్టాల్ల్రో వర్షాలతో యమునా నది మళ్లీ 205.48 విూటర్ల నీటి ప్రవాహానికి చేరుకుని ప్రమాద స్ధాయిని మించి ఉప్పొంగుతోంది. గతవారం భారీ వర్షాలతో పాటు హరియాణలోని హథిన్‌కుంద్ బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయడంతో యమునా నది ఏకంగా 205.33 విూటర్ల ప్రమాదస్ధాయిని మించి ప్రవహించింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు సహాయ పునారావస శిబిరాలను ఏర్పాటు చేశారు. వారం రోజుల పాటు వరద ముప్పుతో కంటివిూద కునుకు కరువైన ఢల్లీి వాసులు మరోసారి ఉలిక్కిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్టాల్ల్రోవర్షాలు కొనసాగుతుండటం, రెయిన్ అలర్ట్స్ జారీ చేయడంతో ఉత్తరాదిని వరద వణికిస్తోంది. ఈ నెల ఆరంభంలో కుండపోతతో వరద పోటెత్తడంతో ఉత్తరాదిలోని పలు రాష్టాల్రు జలమయమయ్యాయి. పొంగి పొర్లుతున్న నదులతో బ్రిడ్జిలు కొట్టుకుపోవడంతో పాటు వాహనాలు సైతం నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. రోడ్లు, విద్యుత్ వ్యవస్ధ సహా మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. వంద మంది ప్రాణాలు కోల్పోగా కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. గుజరాత్‌లో నూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాజ్‌కోట్, సూరత్, గిర్ సోమనాథ్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. మంగళవారం కురిసిన వర్షాల వల్ల .. వరద లాంటి పరిస్థితి ఉత్పన్నమైంది. అనేక పట్టణాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న సూత్రపత తాలూకాలో 345 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది. రాష్ట్రంలో ఇదే అత్యధిక వర్షం కురిసిన ప్రాంతం.
జమ్మూకశ్మీర్‌లో ఇల్లు కూలి ఐదుగురు, కొండచరియలు విరిగిపడి ముగ్గురి మృతి
జమ్మూ : జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మరో చోట కొండ చరియలు విరిగిపడటంతో ముగ్గురు మృత్యువాతపడ్డారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్ ఖయ్యూం, ముస్తాక్ అహ్మద్‌లు బాని ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరు కుటుంబ సభ్యులతో కలిసి రెండు వేర్వేరు ఇళ్లలో ఉండగా భారీ వర్షాలకు అవి ఒక్కసారిగా కూలిపోయాయి. ఈ ఘటనలో అబ్దుల్ ఖయ్యూం కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. వారి మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి.ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి దాకా మూడు మృతదేహాలను వెలికిశారు. మరో ఇద్దరి మృతదేహాలను బయటకు తీసేందుకు కృషి చేస్తున్నారు. మరో చోట కొండ చరియలు విరిగి పడటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ బాలుడు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.భారీ వర్షాల కారణంగా జమ్మూకశ్మీర్‌లోని చాలా ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. ఆకస్మికంగా వరదలు రావడంతో పలు చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. అందువల్ల శ్రీనగర్`జమ్మూ జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. కథువా జిల్లాలోని చద్వాల్ వంతెన దెబ్బతినడంతో జమ్మూ`పఠాన్‌కోఠ్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. పలు చోట్ల బ్రిడ్జిలు, కల్వర్టులు, రోడ్లు దెబ్బతిన్నాయి. జమ్మూకు సవిూపంలోని కత్రా వైష్ణోదేవి ఆలయ తీర్థయాత్రకు బేస్‌క్యాంప్‌గా ఉంది. ఇక్కడ గత 24 గంటల్లోనే 315 మిల్లీవిూటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో వరదలు తీవ్రరూపం దాల్చాయి. మరో వైపు తావి నదిలో కూడా నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. వరద నీటి కారణంగా ఈ నదీ తీరంలో జరుగుతున్న నిర్మాణ పనులు ఆగిపోయాయి. కట్టడాలు చాలా వరకు దెబ్బతిన్నాయి.
గుజరాత్‌లో భారీ వర్షాలు.. వరదనీటిలో తేలియాడిన కార్లు..!
గాంధీనగర్: భారీ వర్షాలు గుజరాత్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. మరికొన్ని రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనావేసింది.ఈ క్రమంలో వానల కారణంగా రాజ్‌కోట్, సూరత్, గిర్ సోమనాథ్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. మంగళవారం పలుచోట్ల 300 మిల్లీవిూటర్ల వర్షం కురిసింది. దాంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ గణాంకాల ప్రకారం.. గిర్ సోమనాథ్ జిల్లాలోని సూత్రపాడ తాలూకాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం జలదిగ్బంధానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ విూడియాలో వైరల్ అవుతున్నాయి. కార్లు, ఇతర వాహనాలు నీటిలో తేలియాడుతున్న వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వరదల కారణంగా దుకాణాలు మూసివేశారు. గిర్ సోమనాథ్‌లోని ఓ ప్రాంతంలో మొసలి జనావాసంలోకి ప్రవేశించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో 43 రిజర్వాయర్లకు హైఅలర్ట్ ప్రకటించినట్లు గుజరాత్‌ప్రభుత్వం వెల్లడిరచింది. మరో 19 రిజర్వాయర్లకు హెచ్చరికలు జారీ చేసింది.ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్(ఔఆఖీఈ), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ (ూఆఖీఈ)ను అధికారులు సిద్ధంగా ఉంచారు. మునిగిన పలు ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతోంది. ఈ కార్యకలాపాలను తెలుగు వ్యక్తి, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) కమాండెంట్ వి.వి.ఎన్.ప్రసన్నకుమార్ పర్యవేక్షిస్తున్నారు.గత నెల గుజరాత్ ను బిపోర్‌జాయ్ తుపానువణికించిన సంగతి తెలిసిందే. దాని ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంతంలో భీకర గాలులు, కుండపోతగా వర్షాలు కురిశాయి. ఆ సమయంలో ఆలయాలు, పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. భారీ సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మళ్లీ డేంజర్ మార్క్ దాటిన యమునా నది
దిల్లీ: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల వరదలు సంభవించి జనజీవనం అస్తవ్యస్తమైంది. దేశ రాజధాని దిల్లీలో యమునా నది మళ్లీ ఉగ్రరూపం దాల్చడం ఆందోళనకు గురిచేస్తోంది.గత కొద్దిరోజులుగా ఈ నదీ ప్రవాహం తగ్గుముఖం పట్టగా.. బుధవారం ఉదయానికి నీటిమట్టం మళ్లీ ప్రమాదకర స్థాయిని దాటింది. దిల్లీలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో యమునమ్మ ఉప్పొంగుతోందని అధికారులు తెలిపారు.కేంద్ర జల కమిషన్ సమాచారం ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటల సమయానికి దిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యుమనా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయి (205.33 విూటర్లు)ని దాటి 205.48 విూటర్లుగా నమోదైంది. ఈ సాయంత్రానికి ఇది 205.72 విూటర్లను చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతవారం యమునా నది నీటిమట్టం ఆల్‌టైం గరిష్ఠానికి చేరి 208.66విూటర్లుగా నమోదవడంతో దిల్లీలోని అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించిన విషయం తెలిసిందే.
ఉత్తరాఖండ్, హిమాచల్‌లో మళ్లీ కుంభవృష్టి..
ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాల ముప్పు పొంచిఉంది. జులై 22 వరకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అటు దిల్లీలోనూ మోస్తరు వర్షాలు కురవనున్నట్లు తెలిపారు.