యువతకు ఆశాజ్యోతిలా తేజస్వి

ప్రచారంలో దూసుకుపోతున్న యువనేత

ఉద్యోగాల కల్పనపైనే ఎక్కువగా ప్రచారం

పాట్నా,నవంబర్‌2(జ‌నంసాక్షి): బీహార్‌ ఎన్నికల ప్రచారంలో రాష్టీయ్ర జనతాదళ్‌(ఆర్జీడీ) నేత తేజస్వీ యాదవ్‌ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా యాన యువతను ఆకట్టుకునేలా ఉద్యోగాల కల్పన ప్రకటనతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే తొలిదశ ఎన్‌ఇనకలు ముగిశాయి. ఇక రెండోదశ ఎన్నికలు మంగళవారం జరుగనుంది. ఇందులో భాగంగా బీహార్‌ రెండవ దశ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం ముగిసింది. ప్రచార పర్యటనల్లో తేజస్వి కొత్త రికార్డులు నెలకొల్పారు. మహాఘట బంధన్‌ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ మెరుపు వేగంతో ప్రచారాలు సాగించారు. తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఒక్క రోజులో చేసిన అత్యధిక ప్రచార ర్యాలీల రికార్డును తేజస్వీ బద్దలు కొట్టారు. తేజస్వీ ఒక్క రోజులో ఏకంగా 17 ర్యాలీలు, 2 రోడ్డు షోలు నిర్వహించారు. గతంలో బీహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఒక్క రోజులో 16 ఎన్నికల బహిరంగ సభలలో పాల్గొని రికార్డు నెలకొల్పారు. దీనిని అధిగమిస్తూ కొత్త రికార్డు నెలకొల్పిన తేజస్వీ శనివారం ఉదయం 10 గంటల 5 నిముషాలకు సీతామడి నుంచి ర్యాలీ ప్రారంభించి, వైశాలి జిల్లాల్లోని బిదూపూర్‌ బ్లాక్‌లో సాయంత్రం 4 గంటల 45 నిముషాలకు చివరి ర్యాలీ నిర్వహించారు. ఈ మధ్యలో మొత్తం 17 ర్యాలీలు, 2 రోడ్డు షోలు నిర్వహించారు. మొత్తంగా అధికారమే లక్ష్యంగా ఆయన ప్రచారంలో దూసుకుపోవడమే గాకుండా బిజెపి,నితీశ్‌లను సవాల్‌ చేస్తున్నారు. తర్వాతి తరాలకు అవకాశం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి పదవి నుండి

తప్పుకోవాలని చెబుతున్నారు. నితీష్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను విపక్షాలకు వెళ్లకుండా జాగ్రత్త పడుతు న్నారు. కేవలం యువతను యైతన్యం చేసేలా ప్రచారం చేపట్టారు.అదేవిధంగా కుల రాజకీయాలకు పెద్ద పీట వేసేందుకు అవసరమైన చర్యలకు ఉపక్రమించారు. నితీష్‌ కుమార్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలకు ఈ యువజన నాయకుడు కొంత ఉత్సాహం నింపుతున్నాడు. దీంతో ఆయనను ఎన్నికల్లో దెబ్బతీయాలన్న లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నారు. నితీష్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, పోలీసులు, అధికార యంత్రాంగం మా మాట వినడం లేదని.. చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో ఆధిపత్యం ఎవరు చెలాయించాలో నిర్ధేశించే స్థాయికి చేరుకుంటుందని అంటున్నారు. ప్రపంచానికంతటికీ మహమ్మారిగా మారి, ఎనిమిది నెలల నుంచి వేధిస్తున్న ప్రాణాంతక వైరస్‌కు లభించబోయే వ్యాక్సిన్‌ను ఓటర్లకు ఒక తాయిలం లాగా భారతీయ జనతాపార్టీ ఇవ్వజూపడం అన్నది క్షమించరాని నేరంగానే చూడాలని ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దిగజారిన రాజకీయాలకు పాల్పడుతోందని తేజస్వి ప్రచారం చేస్తున్నారు. బీహార్‌లో నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం ప్రజల కోసం బాగా పని చేసి ఉంటే ..వారు తమ పనులను చెప్పు కోవాలి తప్ప యువతను తప్పుదారి పట్టించరని అంటున్నారు.