యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

బజారహత్నూర్‌ : మండలంలోని కోత్తపల్లి గ్రామానికి చెందిన భీమ్‌రావు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి మోసగించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వదిలేయడంతో అమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె. రవీందర్‌ తెలిపారు.