యువతిపై నలుగురు వ్యక్తుల గ్యాంగ్ రేప్

పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
-బాధితురాలు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు
నెల్లికుదురు : ఫిబ్రవరి 23 (జనం సాక్షి) మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం
ఆలేరు గ్రామానికి చెందిన యువతి శ్రీరామ్ సుప్రియ తండ్రి సత్యనారాయణ (23) ఒంటరిగా ఉన్న సమయంలో గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ అవమానం భరించలేని యువతి తనపై నలుగురు గ్యాంగ్ రేప్ చేసారని వారిపేర్లు తెలుపుతూ సూసైడ్ నోట్ రాసి ఈనెల 18వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అది గమనించిన బంధువులు ఆమెను వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించసాగారు.
కాగా పరిస్థితి విషమించటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలోనే ఉంచి బందోబస్తు నిర్వహిస్తున్నారు. గ్యాంగ్ రేప్ విషయం బయటకు పొక్కకుండా గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. బాధితురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.  ఈ సందర్భంగా మృతురాలి కుటుంబాన్ని పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి, దయాకర్ రావు మరియు మహబూబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత, శాసనసభ్యులు శంకర్ నాయక్  మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులు ఎంతటివారైనా వారికి కఠినంగా శిక్షపడేలా చేస్తామని  హామీ ఇచ్చారు. కాగా ఈ కేసుకు సంబంధించి నలుగురు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.