” యువశక్తికి సానపెడితే దేశంలో అద్భుతాలు సృష్టించవచ్చు – జివై ఫౌండేషన్ ట్రస్టీ – గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 25( జనంసాక్షి): ఈ ప్రపంచంలో ఏం సాధించాలన్నా అది యువతతోనే సాధ్యమని, యువశక్తికి సరైన దిశలో సానపడితే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చని జివై ఫౌండేషన్ ట్రస్టీ గజ్జల యోగానంద్ అన్నారు. ఈమేరకు గచ్చిబౌలి పరిధి అపర్ణ సైబర్ లైఫ్ అపార్ట్ మెంట్ ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో నిష్ణాతులైన యువతను గుర్తించి వారికి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా GY ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ గజ్జల యోగానంద్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో నిష్ణాతులు ప్రతిభా వంతులను గుర్తించి టాలెంట్ రికగ్నికేషన్ నిమిత్తం అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ముదావహం అన్నారు. అపర్ణ సైబర్ లైఫ్ లో ఎంతో మంది నిష్ణాతులు ఉన్నారన్న సమాచారం చాలా సంతోషాన్ని కలిగించిందని, సదరు ప్రతిభావంతులకు అవార్డులు అందజేయడం ఆహ్వానించదగ్గ పరిణామన్నారు. ఆయా రంగాల్లో నిష్ణాతులు, ప్రతిభావంతులు తమ విశేష ప్రతిభద్వారా ఎప్పటికప్పుడు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేస్తూనే ఉండాలని, మెరుగైన కార్యక్రమాలద్వారా ముందుండాలని గజ్జల పిలుపునిచ్చారు. ఉత్తమ ప్రతిభద్వారా సాధించే ఫలితాలు, పొందే విజయాలు ముందు తరాలవారికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆశాభవం వ్యక్తంచేశారు. యువకులు ముందుకొచ్చి దేశాభివృద్ధిలో తమవంతు పాత్రను పోషించాలని, తద్వారా దేశ ప్రతిష్టను ప్రపంచంలో ఇనుమాడింపజేయాలని యోగానంద్ సూచించారు. దేశసేవలో అందరూ పాలు పంచుకోవాలని, గ్రామాల్లోవున్న ప్రతిభావంతులను గుర్తించి వారికి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు కూడా అందజేయడం జరిగిందని గుర్తుచేశారు. ప్రతిభ ఉన్నవారికి ఎప్పటికైనా తగిన గుర్తింపు దక్కుతుందని, అందుకు నిదర్శనం ఇదేనని ఆయన అన్నారు. ఎంతోమంది యువకుల్లో ప్రతిభ ఉన్నప్పటికీ ఆ ప్రతిభను కనబరిచేందుకు తగిన వేదిక లేకపోవడంవల్ల వారు అక్కడే ఉండిపోతున్నారన్నారు. అలాంటి వారి కోసం GY ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని, ఇందులో భాగంగానే ప్రతిభావంతులను గుర్తించి అవార్డులను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ బర్దన్, దేవేందర్ రెడ్డి, రిషిక మహేశ్వరి, శ్రీరాం భారతిపూడి, పంకజ్ భాతియా, మరియు GY ఫౌండేషన్ వాలంటీర్స్ రమేష్ సోమిశెట్టి, కళ్యాణ్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area