యువ కౌలు రైతు దంపతుల ఆత్మహత్య.. ప్రభుత్వ హత్యనే..! –

– కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి – మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్
జనంసాక్షి, మంథని, అక్టోబర్ 10 :
కౌలు రైతును కాలేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నిండా మంచిదని, ఈ కౌలు రైతు దంపతుల ఆత్మహత్య ప్రభుత్వ హత్య అని, ప్రభుత్వం కౌలు రైతు కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని మంథని ఎమ్మెల్యే దుదిల్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఇటివల కురిసిన భారీ వర్షాలకు మేడిగడ్డ ప్రోజెక్ట్ బ్యాక్ వాటర్ వలన పంటలు అధిక మొత్తంలో నష్టానికి గురయ్యాయని మంథని మండలం ఎగ్లాస్ పూర్ (నెల్లి పల్లె) గ్రామానికి చెందిన కటుక అశోక్ – సంగీత దంపతులు అప్పు చేసి రెండెకరాల భూమి కౌలు కి తీస్కొని సాగు చేస్తుంటే అకాల వర్షాల వలన మెడిగడ్డ ప్రోజెక్ట్ బ్యాక్ వాటర్ వలన గోదావరి నది ముంపుకు గురై పంట పూర్తిగా నష్టపోవడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు మంథని నియోజకవర్గ రైతుల పాలిట శాపంల మారిందని అన్నారు. ఈ యువ కౌలు రైతు దంపతుల ఆత్మహత్య చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాధాలుగా మారారని, ఈ ఆత్మ హత్య ప్రభుత్వ తప్పిదం వలనే జరిగిందని ప్రభుత్వం వెంటేనే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు శశిభూషణ్ కాచే, పేరవీణ లింగయ్య యాదవ్, మంథని సత్యం, పెరవీణ రాజేష్ యాదవ్, బొడ్డు శ్రీను, మంథని శ్రీను తదితరులు ఉన్నారు.